Balakrishna: అఖండ వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నుండి వస్తున్న చిత్రం ‘వీర సింహా రెడ్డి’..బాలయ్య బాబు ప్రస్తుతం మంచి ఫామ్ మీద ఉండడం తో ఈ సినిమా ట్రైలర్ కి ముందు నుండే అంచనాలు అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఉన్నాయి..ఇక ట్రైలర్ విడుదల తర్వాత ఆ అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి.

బాలయ్య బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రతీ ఒక్కరికి అర్థం అయ్యేలా చేసింది ఈ ట్రైలర్..ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు కిక్ ఇచ్చే డైలాగ్స్ తో ఈ ట్రైలర్ కట్ ని నింపేసాడు బాలయ్య..వైసీపీ పార్టీ పై కూడా నేరుగానే సెటైర్లు వేసాడు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలు లో ఘనంగా జరిగింది..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా బాగుంటుంది, రికార్డ్స్ తిరగరాస్తుంది అని నేను చెప్పను..ఎందుకంటే ఈ సినిమా చరిత్ర సృష్టించి తీరుతుంది..నా నుండి అభిమానులు ఏవైతే కోరుకుంటారో అవన్నీ పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయి..ఈ సంక్రాంతి కి వచ్చే సినిమాలన్నీ బాగా ఆడాలి..నా సినిమా మరింత ఎక్కువగా ఆడాలి’ అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది..ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నట్టు కనిపించింది.

అఖండ సినిమా మరియు ‘అన్ స్టాపబుల్’ టాక్ షో భారీ హిట్ అయినా సంతోషం ఆయన మొహం లో కనిపిస్తుంది..ట్రైలర్ కూడా అదిరిపోవడం తో ఈ సినిమా కచ్చితంగా అఖండ రేంజ్ లోనే హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యాయి..టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి..ప్రీమియర్ నంబర్స్ స్టార్ హీరోల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.