Balakrishna: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీజన్ ఆరవ ఎపిసోడ్ కి సీనియర్ హీరోయిన్స్ జయసుధ మరియు జయప్రద తో పాటుగా నేటి తరం స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా పాల్గొన్నారు..ఈ ఎపిసోడ్ మొత్తం సరదాగా సాగిపోయింది..తన తరం హీరోయిన్స్ అయిన జయసుధ జయప్రద తో బాలయ్య బాబు అప్పట్లో చాలా సినిమాలు కలిసి నటించాడు.

ఇక జయప్రద తో ఆయన చివరిసారిగా చేసిన చేసిన చిత్రం ‘మహారథి’..అయితే ఈ షో లో వచ్చిన కంటెస్టెంట్స్ ని బాలయ్య బాబు చాలా బోల్డ్ ప్రశ్నలు అడుగుతాడు అనే సంగతి తెలిసిందే..ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి కూర్చుంటే ఎంత సరదాగా మాట్లాడుకుంటారో..అలా ఉంటుంది ‘అన్ స్టాపబుల్ ‘ షో లో బాలయ్య బాబు తో చిట్ చాట్..ఈ లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా బాలయ్య జయసుధ, జయప్రద మరియు రాశీ ఖన్నాలను చాలా బోల్డ్ ప్రశ్నలు అడుగుతాడు.
ముందుగా ఆయన రాశీ ఖన్నా తో మాట్లాడుతూ ‘నువ్వు నటించిన హీరోలలో నీకు ఎవరి మీద క్రష్ ఉంది’ అని అడగగా, రాశీ ఖన్నా సెకండ్ కూడా ఆలోచించకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్తుంది..వీళ్లిద్దరు కలిసి గతం లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే అట్టర్ ఫ్లాప్ సినిమాలో నటించారు..ఈ సినిమాలో రాశీ ఖన్నా విజయ్ దేవరకొండ తో రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది..ఇక ఈ క్రేజీ ఎపిసోడ్ లో బాలయ్య బాబు మరో బోల్డ్ ప్రశ్న అడుగుతాడు.

ఇండస్ట్రీ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందేనా అని అడుగుతాడు..అయితే ఈ ప్రశ్న కి సమాధానం చెప్పడానికి జయసుధ , జయప్రద మరియు రాశీ ఖన్నా ముగ్గురు కూడా ఇష్టపడరు..అప్పుడు బాలయ్య బాబు మాట్లాడుతూ ‘నటిగా ఎదగడానికి కథకి అవసరమైతే డైరెక్టర్స్ ఏమి చెప్పినా మనం చెయ్యాల్సిందే..అది హీరో కి అయినా హీరోయిన్ కి అయినా అదే వర్తిస్తుంది..ఎవ్వరు అతీతులు కాదు’ అని చెప్పుకొచ్చాడు..అంటే డైరెక్టర్ ఏమి చెప్పిన చెయ్యాలంటే కాస్టింగ్ కౌచ్ ని కూడా బాలయ్య బాబు వెనకేసుకొని వస్తున్నాడా అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.