
Balakrishna Batting: పవర్‌ఫుల్ నటనతో తెరపై విశ్వరూపం చూపించే నందమూరి బాలకృష్ణ రియల్ డైలాగ్స్‌లో మాత్రం చాలా వీక్. స్క్రీన్‌పై బాలయ్య చెప్పే పంచులకే చాలామంది ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. అయితే రాజకీయాల్లో కూడా ఉన్న ఆయన స్టేజీలపై పెద్దగా మాట్లాడలేరు. అలాంటి బాలయ్య బ్యాట్ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆయన బ్యాట్ పట్టి గట్టిగా కొడితే దబిడిదిబిడే. బాలయ్య క్రికెట్ ఆడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఐపీఎల్ కామెంటేటర్‌గా..
నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సెన్సేషనే. తనదైన శైలి నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో ఆయన మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ వయసులోనూ ఆయన అంతే హుషారుతో కుర్రహీరోలతో పోటీపడుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ అభిమానుల్లో సంతోషం నింపుతున్నారు. ఒకవైపు మూవీస్ చేస్తూనే, మరోవైపు ‘అన్‌స్టాపబుల్’ లాంటి టాక్ షోతోనూ ఆయన మెప్పిస్తున్నారు. ఈ షోతో యూత్ ఆడియన్స్‌లో బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు యాంకర్ అవతారం ఎత్తబోతున్నారు బాలకృష్ణ. మరో రెండ్రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్ 16వ సీజన్‌లో కామెంటేటర్‌గా అలరించనున్నారు. బాలయ్య కామెంట్రీ అంటే ఇటు క్రికెట్ ఫ్యాన్స్‌తోపాటు అటు మూవీ ఫ్యాన్స్‌కు కూడా స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే చెప్పొచ్చు.

అడిగిన వెంటనే ఓకే చెప్పాడు..
ఐపీఎల్ సీజన్ తొలి రోజు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో బాలకృష్ణ కామెంట్రీ చేయనున్నారు. వ్యాఖ్యానం చేయాలంటూ స్టార్ స్పోర్ట్స్ నిర్వాహకులు అడిగిన వెంటనే క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో బాలయ్య ఓకే చెప్పేశారట. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్ ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాలరావుతో కలి సి గల్లీ క్రికెట్ ఆడారు బాలయ్య. ఈ గేమ్‌కు స్టార్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ వింధ్య అంపైర్‌గా వ్యవహరించారు. వేణుగోపాలరావు బాల్ విసరగా బాలయ్య గట్టిగా కొట్టారు. దెబ్బకు బాల్ ఎక్కడో దూరంగా వెళ్లి పడింది. ఆ తర్వాత బాలయ్య బౌలింగ్ కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రీల్‌పై పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించే బాలయ్య.. రియల్ కామెంటేటర్‌గా అటు క్రికెట్ ఫ్యాన్స్‌ను.. ఇటు సినిమా ఫ్యాన్స్‌ను ఏమేరకు మెప్పిస్తారో చూడాలి మరి!
https://youtu.be/NoKYGatCKC4