Balakrishna Counter On CM Jagan: అప్పట్లో బాలకృష్ణను యువరత్న అని పిలిచేవారు. ఇప్పుడు వయసు మళ్ళింది కాబట్టి నటసింహం అని అంటున్నారు.. ఆయన కూడా ప్రతి సినిమాలో సింహం అని ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక సంక్రాంతి బరిలో ఆయన వీర సింహారెడ్డి అనే సినిమాతో ముందుకు వస్తున్నాడు.. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ సినిమాకు సంబంధించి ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ట్రైలర్లో ఏకంగా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ గా బాలకృష్ణ కొన్ని డైలాగులు వదిలాడు. అప్పట్లో బోయపాటి శ్రీను రాసేవాడు. ఇప్పుడు గోపీచంద్ మలినేని రాస్తున్నాడు. ఆ ఇద్దరు, ముగ్గురు కథానాయికలు, రక్తపాతం, సీమ, కత్తులు షరామాములే.

నేరుగా మాట్లాడొచ్చు కదా
ఈ ట్రైలర్లో ” సంతకాలు పెట్టినంత మాత్రాన పేరు మారుతుంది.. చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. పదవి ఉన్నది కాబట్టి నీకు పొగరేమో… బై బర్త్ నా డీఎన్ఏ కే పొగరు” ఈ డైలాగులు ట్రైలర్ లో బాలకృష్ణ నోటి నుంచి వినిపించాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా నామకరణం చేయడం… చాలా చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీని జగన్ గోక్కోవడంతో దానికి కౌంటర్ గా ఇందులో ఆ డైలాగులు బాలకృష్ణ నోటి వెంట పలికించినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ గత సినిమాల్లో కూడా జగన్ కు కౌంటర్ ఇలానే ఇచ్చాడు. ఫర్ ది డిబేట్ సేక్… బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే… అంటే ఆయన ఒక ప్రజా ప్రతినిధి. పైగా పేరు మార్చింది తన తండ్రిది. అలాంటప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించవచ్చు కదా… కానీ బాలకృష్ణ అలా చేయడు. ఆయనకు చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయరు. మొన్నటికి మొన్న అన్ స్టాపబుల్ షో లో గుడివాడ ప్రస్తావన రాగానే బాలకృష్ణ కొన్ని డైలాగులు వదిలాడు. ” తెలుసు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నానో అని” క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
మైత్రి సిద్దమేనా?
బాలకృష్ణ వీరలెవల్లో వీర సింహారెడ్డి సినిమా ద్వారా జగన్ మీద డైలాగులు వదిలినా.. జగన్ తో గోక్కోవడానికి మైత్రి మూవీస్ సిద్ధ పడుతుందా అంటే.. ఇందుకు సమాధానం పడదు అనే చెప్పాలి. ఎందుకంటే మైత్రి మూవీస్ కి డబ్బులు కావాలి. పైగా ఈ సినిమాకి భారీగా ఖర్చు చేసింది.. మొన్న జరిగిన ఐటీ దాడులతో ఆ సంస్థకు తల బొప్పి కట్టింది. ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వానితో కూడా గోక్కోవడానికి మైత్రి సిద్ధపడదు.. పైగా వారి చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అంత భయం ఉన్నవాళ్లు ఈ సినిమాలో ఆ స్థాయిలో డైలాగులు ఎందుకు పెట్టారు అని మీరు అడగవచ్చు… వివాదాస్పదంగా ఒకటో రెండో సన్నివేశాలు లేకుంటే ఈ రోజుల్లో సినిమాకి ఎవరు వస్తారు. పైగా అసలు ఇవి యూట్యూబ్ రోజులు.. ప్రేక్షకులను ఎంతో కొంత అటెన్షన్ చేయగలిగితేనే సినిమాకు వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

జగన్ ఒక వేళ తలుచుకుంటే
మైత్రి మూవీస్ సామాజిక వర్గం, బాలకృష్ణ సామాజిక వర్గం ఒకటే.. వాస్తవానికి ఆ సామాజిక వర్గం అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు పడదు.. దానిని దృష్టిలో పెట్టుకునే అమరావతిని పక్కన పెట్టాడు. మూడు రాజధానుల పేరుతో జనాల్లో సెంటిమెంట్లను ఉసిగొలిపాడు. వీలు చిక్కినప్పుడల్లా టిడిపికి సహాయం చేస్తున్న ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలను తొక్కేస్తున్నాడు.. ఒకరకంగా తాను సీఎం అయ్యింది రివెంజ్ తీర్చుకునేందుకే అనే తీరుగా వ్యవహరిస్తున్నాడు.. మరిప్పుడు మైత్రి మూవీస్ ని తొక్కేస్తాడా లేక బాలకృష్ణ అభిమానిగా సినిమాను ఎంజాయ్ చేస్తాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. అన్నట్టు
“జీవో అంటే నీకు గవర్నమెంట్ ఆర్డర్
నాకు గాడ్స్ ఆర్డర్..” మరీ
ఈవెంట్ వెన్యూ ఎందుకు మార్చారు బాలకృష్ణ గారు?!