Balakrishna Birthday: నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna).. వెండితెరపై, బుల్లితెరపై మెరిసిపోతున్న కథానాయకుడు. వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఆ నలుగురు అగ్ర కథానాయకుల్లో దూకుడుగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో అన్ స్టాపబుల్ అంటూ బుల్లితెరపై మెరుస్తున్నారు. అయితే బాలకృష్ణ విషయంలో చిన్నపాటి వార్త అయినా సెన్సేషన్. ఇప్పుడు అటువంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బసవతారకం హాస్పిటల్ లో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. జన్మదిన కేక్ కట్ చేశారు. మాట్లాడుతున్న క్రమంలో గమ్ కావాలంటూ బాలకృష్ణ కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
* చలాకీగా కనిపించిన బాలయ్య..
ఆరుపదుల వయసులో కూడా చాలా చలాకీగా ఉంటారు నందమూరి బాలకృష్ణ. అయితే ఈసారి 65వ జన్మదిన వేడుకలు ఆయన ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో పాటు సన్నటి మీసాలతో కనిపించారు బాలకృష్ణ. అయితే ఆయన మాట్లాడుతున్న క్రమంలో మీసాలు వాలిపోవడం వెలుగు చూసింది. దీంతో వెంటనే గమ్ కావాలంటూ ఆయన కోరిన వ్యాఖ్యలతో.. వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో( social media) వైరల్ చేస్తున్నారు. పెట్టుడు మీసాలు అన్నట్టు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నట్టు అర్థమవుతోంది. అయితే ఇదే జన్మదిన వేడుకల్లో తనపై ఇలాంటి ప్రచారాలు వస్తుంటాయని.. డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇటువంటి చిన్న చిన్న విషయాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేయడం విమర్శలకు దారితీస్తోంది.
* నన్ను చూసే నాకు పొగరు..
నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం, పద్మభూషణ్( Padma Bhushan ) అవార్డు రావడం వంటివి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు బాలకృష్ణ. వరుసగా ఆయన నటించిన నాలుగు సినిమాలు హిట్ కొట్టాయి. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకొని గతంలో అన్న మాటను ప్రస్తావించారు బాలకృష్ణ. ఇకనుంచి నేనేంటో చూపిస్తానని అన్నానని… కానీ ఎక్కువమంది పొగరు అనుకున్నారని… నన్ను చూసుకునే నాకు పొగరు అని వ్యాఖ్యానించారు బాలకృష్ణ. దేహం ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆయన పెట్టుడు మీసం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై మాత్రం బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటివి మంచివి కావని హెచ్చరిస్తున్నారు.
Papam Bulbul Balayya
Chusukovali kada Mental pic.twitter.com/9Dqp6BNf20
— We Love Chiranjeevi (@WeLoveMegastar) June 11, 2025