Dil Raju Sensational Comments on Nithin: సంక్రాంతికి వస్తున్నాం వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత నిర్మాత దిల్ రాజు(Dil Raju) నుండి వస్తున్న చిత్రం ‘తమ్ముడు'(Thammudu Movie). వేణు శ్రీ రామ్(Venu Sriram) దర్శకత్వం లో నితిన్(Nithin) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జులై 4న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఒక డిఫరెంట్ ప్రపంచం లోకి ఈ సినిమా థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని తీసుకెళ్లబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ట్రైలర్ ని చూస్తుంటే ఎమోషన్స్ తో పాటుగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు ఉంది. కచ్చితంగా ఈ చిత్రం నితిన్ కి భారీ కం బ్యాక్ చిత్రం గా నిలుస్తుందని చూసిన ప్రేక్షకులు అంటున్నారు.
అయితే ఈ ట్రైలర్ కి ముందు ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి దిల్ రాజు, నితిన్, లయ, డైరెక్టర్ వేణు శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘సంక్రాంతికి వస్తున్నాం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మా బ్యానర్ నుండి రాబోతున్న చిత్రమిది. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. ‘వకీల్ సాబ్’ తర్వాత వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో మా బ్యానర్ లో ఐకాన్ అనే చిత్రం చేయాల్సి ఉంది. కానీ ‘పుష్ప’ కారణంగా ఆ సినిమా వెనక్కి వెళ్ళింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సుమారుగా నాలుగేళ్ల పాటు తమ్ముడు చిత్రం కోసం వేణు శ్రీరామ్ పని చేసాడు. రీసెంట్ గానే ఔట్పుట్ ని చూసాము,చాలా సంతృప్తిగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా తీస్తున్నప్పుడు నాకు కొంచెం అనుమానం కలిగింది. ఏంటి వేణు సినిమాని తీస్తూనే ఉన్నావు. ఇలా అయితే నాకు వర్కౌట్ అవ్వదు అని ముఖం మీద చెప్పేసాను. అప్పుడు వేణు సార్ నేను మీకు ముందే చెప్పాను కదా, సౌండింగ్ కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నాడు. నిజమే కానీ ఒక నిర్మాతగా నేను పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో లేదో చూసుకోవాలి కదా అని అడిగితే, అప్పుడు వేణు ఇక నుండి నేను డబ్బులు డ్రా చెయ్యను సార్, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయను, సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాకే డబ్బులు తీసుకుంటాను అని చెప్పాడు. నాకు చాలా గొప్పగా అనిపించింది. సినిమా హిట్ అయితే అందరికీ రెమ్యూనరేషన్స్ పెరుగుతాయి. నితిన్ కూడా మీకు ఎంత వీలు అయితే అంత పంపండి సార్, రెమ్యూనరేషన్ విషయం లో నాకు ఎలాంటి పట్టింపు లేదని చెప్పాడు. ఇలాంటి డైరెక్టర్, హీరో ఉంటే ఎలాంటి సినిమాలను అయినా మేము నిర్మించగలం’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు.