
Balakrishna On Bigg Boss: బాలయ్య కెరీర్ బిఫోర్ 2020 ఆఫ్టర్ 2020లా చూడాలేమో. ఈ దశాబ్దం ప్రారంభంలో బాలయ్యలో చాలా మార్పులు వచ్చాయి. ఆయన కొత్త అవతారాలు ఎత్తారు. గతంలో బాలయ్య సోషల్ మీడియాను వాడేవారు కాదు. అభిమానులతో ఆయనకు సంబంధాలు ఉండేవి కావు. ఈ మధ్య ఫేస్ బుక్ వేదికగా ప్రతి ముఖ్య సంఘటన మీద స్పందిస్తున్నారు. ఆయన ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లోకి రావాల్సి ఉంది. ఇక అన్ స్టాపబుల్ షో బాలయ్యలోని కొత్త కోణం ఆవిష్కరించింది. హోస్ట్ గా కూడా రికార్డులను ఊచకోత కోయగలనని నిరూపించారు. ‘బాలయ్య వ్యాఖ్యాతా..! అని పెదవి విరిచిన వాళ్ళు, వ్యాఖ్యాత అంటే బాలయ్య’ అనేలా చేశాడు.
అన్ స్టాపబుల్ షోతో బాలయ్యకు నయా ఫ్యాన్ బేస్ ఏర్పడినట్లు సమాచారం. క్లాస్ ఆడియన్స్ ఆయన్ని ఇష్టపడుతున్నారని వినికిడి. ఇక ఎన్నడూ వ్యాపార ప్రకటనల్లో నటించిన బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆయన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అలాగే ఓ జ్యూయలరీ సంస్థ ప్రచారకర్తగా పని చేస్తున్నారు. విజయవాడలో ఓ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళాడు.
వీటన్నింటికీ మించి బాలయ్య ఐపీఎల్ కామెంటరీ చెప్పనున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందుతుంది. మార్చి 31 నుంచి జరుగనున్న టాటా ఐపీఎల్ మ్యాచెస్ కి బాలయ్య కామెంటేటర్ గా వ్యవహరిస్తారట. కొన్ని ప్రమోషనల్ మ్యాచెస్ కి ఆయన తెలుగు కామెంటరీ చెప్పనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు చేప్పట్టడం ఖాయం అంటున్నారు. అసలు బాలయ్య యాటిట్యూడ్, కరుకుతనం బిగ్ బాస్ హోస్టింగ్ కి బాగా సరిపోతుంది.

బాలయ్య లాంటి వ్యక్తి హోస్ట్ గా ఉంటే కంటెస్టెంట్స్ క్రమశిక్షణతో ఉంటారు. తప్పు చేయాలంటే భయపడతారు. గత నాలుగు సీజన్స్ గా నాగార్జున బీబీ హోస్ట్ గా ఉన్నారు. సీజన్ 6 రేటింగ్ దారుణంగా పడిపోయింది. నాగార్జున హోస్టింగ్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. కాబట్టి బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ గా రంగంలోకి దిగుతారనే ఊహాగానాలను కొట్టిపారేయలేం. ఇక చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతం బాలయ్య తన 108వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.