Balakrishna – Anil Ravipudi: ఈ మధ్య బాలయ్య టైం మాములుగా లేదు. అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మొదటిసారి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్స్ దద్దరిల్లేలా చేసింది. ఒకప్పటి బాలయ్యను గుర్

మరోవైపు హోస్ట్ గా మారి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ రికార్డు వ్యూవర్షిప్ తో దూసుకుపోతోంది. సీజన్ వన్ ట్రెమండస్ సక్సెస్ కాగా… సీజన్ టూ ఇటీవల ప్రారంభమైంది. ఇక వీరసింహారెడ్డిగా సంక్రాంతికి బరిలో దిగుతున్నాడు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న వీరసింహారెడ్డి మూవీపై భారీ అంచనాలున్నాయి. వీరసింహారెడ్డి మూవీలో ఆయన లుక్ అదిరింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు, ఫస్ట్ సాంగ్ కి విశేష స్పందన దక్కింది.
కాగా బాలకృష్ణ నెక్స్ట్ దర్శకుడు అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. అధికారిక ప్రకటన కూడా జరిగింది. బాలయ్య 108వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. ఈ చిత్రం స్టోరీ ఇదే అంటూ ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఆ కథనాల ప్రకారం… హీరో వయసులో ఉన్నప్పుడు నేరం చేసి జైలుకి వెళతాడు. ఆయన చేసిన నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దీంతో 14 ఏళ్ళు జైలులో ఉండి వస్తాడు. జైలు నుండి వచ్చాక హీరో వయసు యాభై ఏళ్ళు దాటుతుందట.

అసలు హీరో చేసిన నేరం ఏమిటీ? మధ్య వయసులో జైలు గోడలు దాటి బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టిన హీరో లక్ష్యం ఏమిటీ? అనేదే ఈ మూవీ కథ అంటున్నారు. ఈ లైన్ గతంలో బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి మూవీని తలపిస్తుంది. ఆ మూవీలో ఫ్యాక్షనిస్ట్ బాలయ్య శత్రువుల కుట్రకు బలై… ఇరవై ఏళ్లకు పైగా తీహార్ జైల్లో మగ్గిపోతాడు. బయటకు వచ్చాక తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై పగ తీర్చుకుంటాడు. మరి ప్రచారం అవుతున్న కథలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది.