Balagam: గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా కథ నాదే.. అంటూ కొందరు ఆందోళన చేసిన సందర్భాలున్నాయి. మరికొందరు కోర్టుల్లో కేసులు వేసి మరీ సినిమా రిలీజ్ కాకుండా చేసిన వారున్నారు. కానీ తాజాగా మార్చి 3న రిలీజైన ‘బలగం’ సినిమాకు ఇదే రోజు కాఫీ కథ అంటూ గడ్డం సతీష్ రచ్చకెక్కారు. తాను రాసుకున్న కథనే సినిమాగా తీశారని ఆయన ఆంటున్నారు. ఈ సినిమా విషయంలో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే సతీష్ చేసిన సంచలన ప్రకటనపై ఇప్పటి వరకు బలగం మూవీ టీం స్పందించలేదు.
తెలంగాణ యాస ప్రధానంగా తెరమీదకు వచ్చిన చిత్రం ‘బలగం’.. కమెడియన్ వేణు తొలిసారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ప్రియదర్శన్, అవికా గోర్ లో నటించారు. చిన్న సినిమానే అయిన దీనికి దిల్ రాజు ప్రొడ్యూసర్. సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందు కొందరు ప్రముఖులు సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు. దీంతో సినిమాపై హోప్స్ పెరిగాయి. మరోవైపు రివ్యూస్ లోనూ సినిమాకు పాజిటివ్ రేట్ పెంచి ప్రచారం చేయడంతో చిన్న సినిమాకు గుర్తింపు వచ్చిందని చర్చించుకున్నారు.
ఈ తరుణంలో గడ్డం సతీష్ అనే జర్నలిస్టు తాను ఓ పత్రికలో రాసిన కథను సినిమా రూపంలో తీశారని ఆరోపించారు. గతంలో తాను నమస్తే తెలంగాణలోని సండే మ్యాగ్జిన్ లో వేసిన కథ ప్రకారం ‘మనిషి మరణించిన తరువాత 3వ రోజు, 5వ రోజు, 11వ రోజు ఇలా పక్షికి ముద్దలు పెడుతారు. అవి కాకులు తింటే ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచారం’ అనేది 2014లో ప్రచురించబడిందని ఆయన చెప్పారు.
ఇప్పుడు బలగం సినిమాలో 90 శాతం నేను రచించిందే ఉందన్నారు. 10 శాతం మాత్రమే మార్పులు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా దీనిని తాను 2011లోనే రచించానని, కానీ ఆ సమయంలో తెలంగాణ యాస నిరాధరణకు గురికావడంతో బయటకు రాలేదని అన్నారు. అయినా అప్పటి నుంచి తెలంగాణ యాసలో పలు కథలను రచించినట్లు తెలిపారు.
గడ్డం సతీష్ చేసిన ఆరోపణలకే ‘బలగం’ టీం స్పందించలేదు. అయితే సినిమా చూసిన తరువాత తాను డైరెక్టర్ వేణును కలిశానని, కానీ అప్పుడేం మాట్లడలేదని తెలిపారు. ఇక ఈ వివాదంపై దిల్ రాజు కల్పించుకొని తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ తరుణంలో దిల్ రాజు స్పందించి వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.