https://oktelugu.com/

Balagam movie Collections : ‘బలగం’ మొదటి వారం వసూళ్లు..ఎవ్వరూ ఊహించని భారీ లాభాలు..అసలైన విజయం అంటే ఇదే!

Balagam movie Collections  : చిన్న సినిమాగా విడుదలై మంచి పాజిటివ్ రివ్యూస్ ని దక్కించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సినిమాలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి.వాస్తవానికి ఇలాంటి సినిమాల నుండే నిర్మాతలు అత్యధిక లాభాలను పొందుతున్నారు.పెద్ద సినిమాలు సూపర్ హిట్ అయ్యి,రికవరీ చేసుకోవడానికే ముప్పుతిప్పలు పడుతున్న ఈ రోజుల్లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ ని శాసిస్తున్నాయి. గత ఏడాది అలా ‘కాంతారా’ చిత్రాన్ని చూసాము.ఈ ఏడాది ‘బలగం’ అనే […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2023 / 09:56 PM IST
    Follow us on

    Balagam movie Collections  : చిన్న సినిమాగా విడుదలై మంచి పాజిటివ్ రివ్యూస్ ని దక్కించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సినిమాలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి.వాస్తవానికి ఇలాంటి సినిమాల నుండే నిర్మాతలు అత్యధిక లాభాలను పొందుతున్నారు.పెద్ద సినిమాలు సూపర్ హిట్ అయ్యి,రికవరీ చేసుకోవడానికే ముప్పుతిప్పలు పడుతున్న ఈ రోజుల్లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ ని శాసిస్తున్నాయి.

    గత ఏడాది అలా ‘కాంతారా’ చిత్రాన్ని చూసాము.ఈ ఏడాది ‘బలగం’ అనే సినిమా ద్వారా మరోసారి చూస్తున్నాము.ప్రముఖ కమెడియన్ ప్రియా దర్శి హీరోగా , కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా జబర్దస్త్ పాపులర్ కమెడియన్ వేణు టిల్లు దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు.మొదటి నుండి ఈ సినిమాని సరైన పద్దతి లో ప్రమోట్ చేసి ఆడియన్స్ లో హైప్ తీసుకొని రావడానికి దిల్ రాజు తన తెలివిని ఉపయోగించి బాగా ప్రమోట్ చేసాడు.

    సినిమా ఔట్పుట్ అద్భుతంగా వచ్చింది అనే విషయం తెలుసు కాబట్టి ఆయన ఈ చిత్రం విడుదలకు వారం రోజుల ముందు నుండే తెలంగాణ ప్రాంతం లో ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేసాడు.వాటి నుండి టాక్ అదిరిపోయింది, కానీ ఆ టాక్ సినిమాకి ఓపెనింగ్స్ పెద్దగా తీసుకొని రాలేకపోయింది కానీ, రోజు రోజుకి టాక్ పెరుగుతూ పొయ్యి జనాలకు బాగా రీచ్ అవ్వడం తో కలెక్షన్స్ అమాంతం పెరిగిపోయాయి.కేవలం 55 లక్షల రూపాయిల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా, మొదటి వారం పూర్తి అయ్యేసరికి 7 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది.

    షేర్ వసూళ్లు దాదాపుగా మూడు కోట్ల 20 లక్షల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.జనాల్లో టాక్ బాగా వెళ్ళిపోయింది కాబట్టి ఈ వీకెండ్ అన్ని ప్రాంతాలలో షోస్ బాగా పెరిగిపోయాయి, ట్రెండ్ ని బట్టీ చూస్తూ ఉంటే ఈ సినిమా ఈ వీకెండ్ కి పడి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు,5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాదిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం.