
Balagam Actor Muralidhar- Ram Charan: టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోరు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఆయన నేడు గ్లోబల్ స్టార్ గా, ఆస్కార్ విజేతగా నిలిచాడు. ఆయనతో ఒక సినిమా చెయ్యడానికి ఇప్పుడు టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ప్రముఖ స్టార్ డైరెక్టర్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ 100 కోట్ల రూపాయిలు ఉంటుంది.ఈ స్థాయి ఆయనకీ ఊరికే రాలేదు, చిరంజీవి కొడుకుని కదా నాకేమి, ఏది చేసిన చెల్లుద్ది అని అనుకోని ఉండుంటే ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉండేవాడు.
కెరీర్ ప్రారంభం లో రామ్ చరణ్ పై ఎంతో మంది ప్రముఖులు నోటికొచ్చినట్టు కామెంట్స్ చేసేవారు. కానీ రామ్ చరణ్ వాటిపై ఏనాడు కూడా స్పందించలేదు, తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఫలితం సహజం గానే వచ్చేసింది. ఆయన మొదటి సినిమా చిరుత చూసి జనాలు ఏమనుకునేవారో రీసెంట్ ‘బలగం’ మూవీ నటుడు మురళీధర్ చెప్పుకొచ్చాడు, ఆయన ఏమి మాట్లాడాడో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఆయన మాట్లాడుతూ “మా ఆఫీస్ లో ఒక నా పక్కనే ఒక అమ్మాయి ఉండేది. అప్పుడే చిరుత సినిమా విడుదలైంది. ఆ అమ్మాయి చిరంజీవి గారి అబ్బాయి సినిమాలు ఎలా అయినా చూడాలని ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ వెళ్ళింది.షో చూసి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని షాక్ అయ్యాను. ఆమె నాతో అంటూ ఏమి సినిమా సార్ అది, చిరుత అని పేరు పెట్టారు, కానీ ఆ అబ్బాయి కనీసం చిట్టెలుక లాగ కూడా లేదు అని అనింది. ఆ అమ్మాయి అలా చెప్పడం లో తప్పు లేదు, ఎందుకంటే ఆరోజుల్లో ఆయన మీద జనాలకు ఉన్న అభిప్రాయం అది. కానీ ఈరోజు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు అండీ.. ఆస్కార్ అవార్డుని గెలుచుకొని వచ్చాడు.అక్కడి నుండి ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత కష్టం చేసి ఉంటాడు’ అంటూ మురళీ ధర్ మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ దీనికి ఫైర్ అవ్వకుండా, మా హీరో ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ కి వెళ్ళాడో చూడండి అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
Balagam Movie Actor About Our Idol
A True Achiever Global Star @AlwaysRamCharan 💥
#ManOfMassesRamCharan #GlobalStarRamCharan #RamCharan pic.twitter.com/4y0FqqiELO
— RCYGirls (@RCYGirls_) April 12, 2023