
Balagam Actress Roopa Lakshmi: బలగం మూవీలో దాదాపు అందరూ కొత్త నటులే. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, వేణు మాత్రమే తెలిసిన ముఖాలు. ప్రధాన పాత్రలకు కూడా వేణు పెద్దగా పేరు లేని నటులను తీసుకున్నారు. అది ఆ సినిమాకు ప్లస్ అయ్యింది. యాక్టర్స్ కాకుండా కేవలం పాత్రలు చూసిన భావన కలిగించారు. బలగం మూవీ అత్యంత సహజంగా ఉండటానికి కూడా ఆ నటులే కారణం. సీనియర్స్ కాకపోయినా యాక్టింగ్ ఇరగదీశారు. కొమురయ్య, నారాయణ, ఐలయ్య, లక్ష్మి వంటి పాత్రలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి.
బలగం నటులందరూ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. వారి గురించి ఆడియన్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. వారి నేపథ్యం ఏమిటని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకున్న పాత్రల్లో లక్ష్మి ఒకటి. భర్త-అన్నదమ్ముల మధ్య గొడవ కారణంగా పుట్టింటికి దూరమైన కూతురు లక్ష్మి పాత్ర కన్నీరు తెప్పిస్తుంది. లక్ష్మి పాత్రను రూప లక్ష్మి అనే నటి చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రూప లక్ష్మి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
చిన్న వయసులోనే హీరోయిన్ కి తల్లి పాత్ర చేయడం ఎలా అనిపించి? ప్రభాస్ వంటి హీరోకి తల్లిగా చేయాల్సి వస్తే చేస్తారా? అని అడగ్గా… ప్రపంచంలో మాతృత్వం కంటే గొప్పది ఏదీ ఉండదు. తల్లి స్థానం విలువైంది. ప్రభాస్ కి తల్లిగా చేయమన్నా చేస్తాను. ఏ స్టార్ హీరోతో అయినా, 70 ఏళ్ల వ్యక్తికి తల్లిగా నటించామన్నా చేస్తాను. ఆ పాత్ర చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని రూప లక్ష్మి అన్నారు. తన కుటుంబ నేపథ్యం తెలియజేస్తూ… మా నాన్న ఓ రైతు. మేము ఆరుగురం సంతానం. నన్ను ఓ లెక్చరర్ కి దత్తత ఇచ్చారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటాను, అని వెల్లడించారు.

దర్శకుడు వేణు ఎల్దండి బలగం చిత్ర కథను రాసి, దర్శకత్వం వహించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చిదంటే… తెలంగాణా వ్యాప్తంగా పల్లెల్లో బహిరంగ ప్రదర్శనలు వేసుకుని జనాలు చూస్తున్నారు. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా ఉంది. దీన్ని దిల్ రాజు అడ్డుకుంటున్నాడని వార్తలు రాగా… ఆయన ఖండించారు.