
Allu Arjun- Avinash: ఒక్కోసారి మన చర్యలు తెలియకుండానే వివాదస్పదం అవుతాయి. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేకున్నా ఇతరుల మనోభావాలు దెబ్బతినే అవకాశం కలదు. ముక్కు అవినాష్ విషయంలో అదే జరిగింది. ఆయన అభిమానంతో చేసిన పని తప్పుగా ప్రొజెక్ట్ అయ్యింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయన్ని తిట్టిపోస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే పురస్కరించుకుని పుష్ప 2 టీజర్ విడుదల చేశారు. మూడు నిమిషాల ‘పుష్ప ఎక్కడ?’ కాన్సెప్ట్ ప్రోమో దుమ్ముదులిపింది. సినిమా మీద హైప్ పెంచింది.
అలాగే పుష్ప 2 టీమ్ ఒక సర్పరైజింగ్ లుక్ విడుదల చేశారు. చీర ధరించి అమ్మోరు గంగమ్మ గెటప్ లో అల్లు అర్జున్ భయంకరంగా ఉన్నాడు. ఈ పోస్టర్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ అమ్మోరు గెటప్ కి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. కాగా అల్లు అర్జున్ ధరించిన ఆ అమ్మోరు గెటప్ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ట్రై చేశాడు. తాను సేమ్ గెటప్ వేసి ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
అల్లు అర్జున్ కి తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పాడు. అయితే ఈ ఫోటో వివాదాస్పదం అవుతుంది. అల్లు అర్జున్ ని అవినాష్ కాపీ చేయడాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. నువ్వు అర్జెంటుగా ఫోటో డిలీట్ చెయ్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అల్లు అర్జున్ ని ఇంప్రెస్ చేయాలని అవినాష్ చేసిన పని అభిమానులకు మాత్రం నచ్చలేదు.

కాగా అవినాష్ జబర్దస్త్ వేదికగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెవ్వు కార్తీక్ తో పాటు అతడు టీం లీడర్ గా చేశాడు. 2020 లో ఆయన బిగ్ బాస్ షోకి వెళ్లారు. సీజన్ 4 లో పాల్గొన్న అవినాష్ జస్ట్ ఫినాలేకి ముందు ఎలిమినేట్ అయ్యాడు. అగ్రిమెంట్ బ్రేక్ చేసి బిగ్ బాస్ షోకి వచ్చినందుకు మల్లెమాల సంస్థకు రూ. 10 లక్షలు చెప్పినట్లు అవినాష్ వెల్లడించారు. ఇటీవల బీబీ జోడీలో సందడి చేశాడు. అరియనా-అవినాష్ జోడీగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఫైనల్ లో ఫైమా-సూర్య చేతిలో ఓడిపోయారు.