Avatar – The Way of Water : గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అవతార్ 2 చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. అయితే ఇండియన్ బాక్సాఫీస్ మాత్రం షేక్ చేస్తుంది ఈ చిత్రం. విడుదలైన నెల రోజులు కావస్తున్నా వసూళ్లు నెమ్మదించలేదు. ఇండియాలో మొత్తం ఆరు భాషల్లో అవతార్ 2 విడుదల చేశారు. అన్ని రాష్ట్రాల్లో అవతార్ 2 విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఏపీ/తెలంగాణాలలో అవతార్ 2 రూ. 95 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ అవతార్ 2 రూ. 450 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. గత హాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసిన అవతార్ 2 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మొన్నటి వరకు ఈ రికార్డు అవెంజర్స్ ఎండ్ గేమ్ పేరిట ఉండేది. అవతార్ 2 ఆ చిత్ర రికార్డు బ్రేక్ చేసింది.
ఇక ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలను పరిశీలిస్తే… అవతార్ 2 రూ. 450 కోట్లు, అవెంజర్స్ ది ఎండ్ గేమ్ రూ. 440 కోట్లు, అవెంజర్స్ ది ఇన్ఫినిటీ వార్ రూ. 296.5 కోట్లు, స్పైడర్ మాన్ నో వే హోమ్ రూ. 261.9 కోట్లు, ది జంగిల్ బుక్ రూ. 259.3 కోట్లు, ది లయన్ కింగ్ రూ.184.7 కోట్లు, డాక్టర్స్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ రూ. 161 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. అవతార్ 2 టాప్ పొజిషన్ సొంతం చేసుకుంది.
అవతార్ 2 రన్ ఇంకా కొనసాగుతుండగా… ఫైనల్ ఫిగర్ రూ. 500 కోట్లకు చేరే అవకాశం కలదని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అవతార్ 2 సత్తా చాటలేకపోయింది. అవతార్ 2 ఇప్పటి వరకు $ 1.5 బిలియన్ వసూళ్లు మాత్రమే అందుకుంది. 2009లో విడుదలైన అవతార్ $2.92 మిలియన్ వసూళ్లతో వరల్డ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా ఉంది. 13 ఏళ్లుగా ఆ రికార్డు ఎవరూ బీట్ చేయలేదు.
అవతార్ వసూళ్ళలో సగం మాత్రమే అవతార్ 2 వసూళ్లు సాధించింది. మహా అయితే $2 బిలియన్ వసూళ్ల వరకూ చేరుకోవచ్చు. అవతార్ రికార్డ్స్ సీక్వెల్ బద్దలు కొడుతుందనుకుంటే అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ మీడియా సంస్థలు అవతార్ 2 చిత్రానికి దారుణమైన రేటింగ్ ఇచ్చాయి. యూఎస్ బాక్సాఫీస్ పై నెగిటివ్ రివ్యూస్ ప్రభావం పడింది. లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ సిరీస్. ఈ ఫ్రాంచైజ్ లో మరికొన్ని చిత్రాలు రానున్నాయి.