Avatar 2 Collections: జేమ్స్ కెమరూన్ సుమారుగా 12 సంవత్సరాలు కస్టపడి తెరకెక్కించిన వెండితెర మహా అద్భుతం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది కానీ మొదటి పార్ట్ కి వచ్చినంత రెస్పాన్స్ మాత్రం రాలేదు..రొటీన్ స్టోరీ అవ్వడం వల్లే అందుకు కారణం అంటున్నారు విశ్లేషకులు..స్టోరీ రొటీన్ అయ్యినప్పటికీ కూడా విజువల్స్ పరంగా ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని కలిగించింది ఈ చిత్రం.

ఇక మొదటి రోజు వసూళ్లు కూడా అద్భుతంగానే వచ్చాయి కానీ ఆశించిన స్థాయి వసూళ్లు మాత్రం రాలేదు..ఈ చిత్రాన్ని సుమారుగా 2 బిలియన్ డాలర్లు..అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 16 వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి తీశారు..బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దది..కానీ 2019 వ సంవత్సరం లో విడుదలైన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ మొదటి రోజు వసూళ్లను బ్రేక్ చెయ్యడం లో విఫలం అయ్యింది..ఇది నిజంగా ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ చిత్రం మొదటి వీకెండ్ నార్త్ అమెరికా వసూళ్లు 280 మిలియన్ డాలర్లు చేసింది..ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ చిత్రం 250 మిలియన్ డాలర్లు మరియు డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం 175 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది..కానీ ‘అవతార్ 2’ వీకెండ్ కి కనీసం డాక్టర్ స్ట్రేంజ్ ఓపెనింగ్స్ ని కూడా కొట్టే అవకాశాలు కనిపించడం లేదు..మొదటి రోజు ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో కేవలం 55 మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి..అవతార్ లాంటి ఫ్రాంచైజ్ నుండి వచ్చిన సినిమాకి ఇది చాలా తక్కువ వసూళ్లు అనే చెప్పాలి.

మన ఇండియా లో కూడా ఈ చిత్రం అవెంజర్స్ మొదటి రోజు వసూళ్లను బ్రేక్ చెయ్యడం లో విఫలం అయ్యింది..ఈ చిత్రానికి ఇండియాలో మొదటి రోజు అన్ని భాషలకు కలిపి 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..కానీ అవతార్ 2 చిత్రానికి కేవలం 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..అలా డొమెస్టిక్ మరియు ఓవర్సీస్ లో ఈ చిత్రం ఓపెనింగ్స్ ఆశాజనకంగా లేవు.