అంతా నా ఇష్టం అంటున్న ‘బిగ్ బాస్’.. మండిపడుతున్న ప్రేక్షకులు..!

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. అయితే గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్-4 మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ నిర్వాహాకులు ప్రేక్షకుల ఓటింగ్ ను పెద్దగా పట్టించుకోకుండా స్క్రీప్ట్ ప్రకారం షోను నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. దీంతో ఈ షో టీఆర్పీ రోజురోజుకు పడిపోతోంది. తాజాగా బిగ్ బాస్-4 కార్యక్రమం 8వారాలను పూర్తి చేసుకొని 9వ వారంలోకి అడుగుపెడుతోంది. 8వ వారం చివరి రోజును […]

Written By: NARESH, Updated On : November 2, 2020 2:21 pm
Follow us on

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. అయితే గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్-4 మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ నిర్వాహాకులు ప్రేక్షకుల ఓటింగ్ ను పెద్దగా పట్టించుకోకుండా స్క్రీప్ట్ ప్రకారం షోను నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. దీంతో ఈ షో టీఆర్పీ రోజురోజుకు పడిపోతోంది.

తాజాగా బిగ్ బాస్-4 కార్యక్రమం 8వారాలను పూర్తి చేసుకొని 9వ వారంలోకి అడుగుపెడుతోంది. 8వ వారం చివరి రోజును యథావిధిగా హోస్టు నాగార్జున కంటెస్టులతో ఆటలు ఆడించి ఎలిమినేషన్ పూర్తి చేశారు. అయితే చివర్లో ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ప్రేక్షకులకు ట్వీస్ట్ ఇచ్చాడు. దీనిపై కూడా పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

8వ వారంలో అందరికీ తక్కువ ఓట్లు అమ్మ రాజశేఖర్ కు రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి అతడు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. అయితే ఇక్కడ మరో డ్రామాకు ‘బిగ్ బాస్’ తెరలేపాడు. నోయల్ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళుతూ ఈ వారం ఎలిమినేషన్ ఎవరినీ చేయద్దని కోరాడని అందుకే ఎవరినీ బయటికి పంపించడం లేదని తెలిపాడు. అయితే అతడికి కెప్టెన్సీ ఇవ్వడం ఏంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

బిగ్ బాస్ అంతా తనకు నచ్చినట్లు చేస్తే ఓటింగ్ ప్రక్రియ ఎందుకంటూ మండిపడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు కొనసాగేది.. లేనేది నిర్ణయించేంది ఓటింగ్ చేసేవాళ్లే. అయితే అందుకు భిన్నంగా బిగ్ బాస్ తనకు నచ్చినవారిని హౌస్ ఉంచుతూ నచ్చనివారిని ఏదో సాకుతో బయటికి పంపిస్తుండటంపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ మాత్రానికి తాము ఎందుకు ఓటింగ్ చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు.

గతంలోనూ కుమార్ సాయి.. దేవి నాగవల్లి.. దివీ విషయంలోనూ బిగ్ బాస్ ఇలానే వ్యవహరించాడని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఎలిమినేషన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ బిగ్ బాస్ వైఖరిలో మార్పురాకపోగా అదే తప్పు చేస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల ఓటింగ్ కు విలువ ఇవ్వకుండా ఓటింగ్ ఎందుకు పెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 8వ వారం ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఇకనైనా బిగ్ బాస్ ప్రేక్షకుల ఓటింగ్ కు విలువను ఇస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!