Atrocious Incidents: పెళ్లి అనేది వెనుకటి కాలంలో పెద్దలు కుదుర్చితే జరిగేది. ఇప్పుడు అలా కాదు.. కాలం మారింది.. దాంతోపాటు మనుషుల ప్రవర్తన కూడా మారింది.. పెద్దలు కుదుర్చిన వివాహాల కంటే.. తమ ఇష్టానుసారంగానే యువత జీవిత భాగస్వాములను నిర్ణయించుకుంటున్నారు. తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఇవి ఇంతవరకు బాగానే ఉన్నాయి.. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలే ఘోరాలకు కారణమవుతున్నాయి.
Also Read: పట్టాలపై కారు డ్రైవింగ్ ఆ యువతీ ఎందుకు చేసిందో తెలుసా? కారణం బయటపడింది
ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో దారుణమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఇవి జరిగిన తీరు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకుంటున్నది. వివాహేతర సంబంధాలు.. వంటివి మానవ సంబంధాలను సర్వనాశనం చేస్తున్నాయి. మనుషుల మధ్య ఉన్న ఆ కాస్త ఆప్యాయతను కూడా కాలగర్భంలో పడేస్తున్నాయి. తేజేశ్వర్, అంజలి, సురేష్ పేర్లు మాత్రమే వేరు.. జరిగిన దారుణాలు మాత్రం దాదాపుగా ఒకటే. ఇవి జరిగిన దారుణాలు చూస్తుంటే మనుషుల మధ్య ప్రేమలు ఉండాల్సిన చోట ఎంత కసి ఉందో అర్థమవుతోంది. ఎంతటి ప్రతీకారాలు పెరిగిపోయాయో అవగతమవుతుంది.
ఉదాహరణకు తేజేశ్వర్ ఘటనను తీసుకుంటే.. అతడితో వివాహం కుదిరిన తర్వాత ఐశ్వర్య బ్యాంకు మేనేజర్ తో లేచిపోయింది. ఏకంగా ఐదు రోజులపాటు అతనితో శారీరకంగా గడిపింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు తేజేశ్వర్ దగ్గరికి వచ్చింది. ఆమె పారిపోయిన తీరును తేజేశ్వర్ ప్రశ్నించాడు. దీంతో ఆమె సీరియల్ నటన ప్రదర్శించింది. ఆమె కన్నీరుకు కరిగిపోయిన తేజేశ్వర్.. చివరికి ఆమె వేసిన ప్రణాళికలోనే చిక్కుకున్నాడు. ప్రాణాలు కోల్పోయాడు.
ఇక అంజలి ఘటన మరింత దారుణమైనది.. తన కుమార్తెను ప్రేమించిన యువకుడి పై అంజలి కేసు పెట్టించడమే ఆమె పాలిట పాపం అయింది. చివరికి తన కుమార్తె చేతిలోనే ఆమె చనిపోవడం.. గమనార్హం. అంజలి చనిపోవడంతో ఆమె చిన్న కుమార్తె ఇప్పుడు అనాధగా మారిపోయింది. అటు నాన్న లేక.. ఇటు తల్లిని సోదరి చంపడంతో గుండెలు పగిలే విధంగా రోదిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలోని అక్కంపల్లి ప్రాంతంలో హోటల్ నిర్వాహకుడు సురేష్ బాబు ను అతని సతీమణి అంతం చేసింది. తన ప్రియుడితో గడపకుండా అడ్డుగా ఉన్నాడని ఇంతటి దారుణానికి పాల్పడింది. వాస్తవానికి ఈ సంఘటనలు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి. కాకపోతే ఇందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ సంఘటనల వెనుక వృత్తాంతాలు దాదాపుగా ఒకే తీరుగా ఉన్నప్పటికీ.. మనుషులు తీసుకుంటున్న నిర్ణయాలే అత్యంత దారుణంగా ఉంటున్నాయి. తేజేశ్వర్ ఘటనలో పెళ్లి వద్దని ఐశ్వర్య చెప్తే బాగుండేది. అంజలి విషయంలోనూ పోలీసులు ఆ యువకుడికి గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తే సరిపోయేది.. ఇక అక్కంపల్లిలో సురేష్ తో తాను ఉండలేనని భార్య స్పష్టం చేస్తే.. అతని ప్రాణం భూమ్మీద ఉండేది. అయితే ఈ ఘటనలలో నిందితులు తీసుకొని నిర్ణయాలు అత్యంత దారుణాలకు ఒడిగట్టే విధంగా ఉన్నాయి. అందువల్లే అవి సభ్య సమాజం తలదించుకునేలా చేశాయి.
Also Read: కుటుంబ జీవితం బాగుండాలంటే.. ఈ ఉద్యోగాలు చేయొద్దు..