Pune: సభ్యసమాజం తలదించుకునే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య కూడా లేనిపోని గొడవలకు కారణాలవుతున్నాయి. సొంత చెల్లెలుపైనే అక్క లైంగిక దాడికి దిగడం సంచలనం కలిగిస్తోంది. మన సమాజం ఎటు పోతోంది. రాక్షసత్వం ఇంతగా పెరిగితే మానవ మనుగడ ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. చెల్లెలు అనే భావం మరిచిపోయిందా? సొంత వారిపైనే అఘాయిత్యానికి దిగడం సంచనంగా మారింది. సభ్యసమాజమే నివ్వెరపోతోంది. చెల్లెలిపైనే వావివరసలు మారి అత్యాచార యత్నం చేయడం గమనార్హం.

మహారాష్ట్రలోని పుణేలో 24 ఏళ్ల అక్క, 18 ఏళ్ల చెల్లెళ్లు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. మంగళవారం ఉదయం చెల్లెలు ఇంట్లోని హాలులో నిద్రపోతోంది. దీంతో అక్కడకు వచ్చిన అక్క చెల్లెలితో తప్పుగా ప్రవర్తించింది. దీంతో మెలకువ వచ్చిన చెల్లి ఆందోళనకు గురైంది. ఏమిటిదని వారించింది. అయినా కామ వాంఛతో ఉన్న అక్క చెల్లెలుపై దాడికి ప్రయత్నించింది. అక్క తీరుతో అవాక్కయిన చెల్లి తేరుకుని అక్కతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది.
అయినా అక్క తీరులో మార్పు లేకపోవంతో చెల్లెలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అక్క చేసిన పనికి చెల్లి నిర్ఘాంతపోయింది. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు కూడా ఆచితూచి అడుగేస్తున్నారు. విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. అక్కకు ఇది వరకే పెళ్లయి భర్తతో విడిపోయి పుట్టింటిలో ఉంటోంది. ఆమె ప్రవర్తనతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆమె విషయంపై చర్చించేందుకు కుటుంబ సభ్యులు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అక్కాచెల్లెళ్లు అనే బంధానికి మాయని మచ్చగా మిగలడంతో అందరు అసహ్యించుకుంటున్నారు. బాధ్యత మరిచి సొంత చెల్లెలుపైనే దాడికి దిగడం అమానుషం. నాగరికత ప్రపంచంలో మనం ఎక్కడకు వెళ్తున్నాం. వావివరసలు మరిచి చెల్లినే టార్గెట్ చేసుకోవడం బాధాకరమే. దీనిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెల్లెలని చూడకుండా తెగబడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్క ప్రవర్తనపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది.