
Mahesh Babu Love story : సినీ పరిశ్రమ అన్న తర్వాత హీరోల మీద కానీ, హీరోయిన్ల మీద కానీ రూమర్స్ రావడం సర్వ సాధారణం.ఆ రూమర్స్ కూడా ఊరికే అయితే రావు, రూమర్ కి తగ్గట్టుగా ఏదైనా ఇండస్ట్రీ లో జరిగి ఉంటేనే ఇలాంటివి బయటకి వస్తాయి.అలా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ ఒక్కరిపైనా రూమర్స్ వచ్చాయి కానీ, ఒక్కరి మీద మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రూమర్ రాలేదు.ఆ ఒక్కరు మరెవరో కాదు, మన సూపర్ స్టార్ మహేష్ బాబు.
అయితే నమ్రత శిరోద్కర్ తో పెళ్ళికి ముందు మహేష్ బాబు మీద పలు రూమర్స్ వచ్చాయనే విషయం చాలా మందికి తెలియదు.అప్పట్లో మహేష్ బాబు మరియు త్రిష కాంబినేషన్ లో ‘అతడు’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ కాకపోయినా, క్లాసిక్ గా మిగిలిపోయింది.ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో వచ్చినప్పుడు ఆడియన్స్ టీవీ లకు అత్తుక్కుపోయి మరీ చూస్తారు.
అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో మహేష్ బాబు మరియు త్రిష బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారని, వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి.అప్పటికి మహేష్ – నమ్రతకి కి ఇంకా పెళ్లి కాలేదు కానీ,మహేష్ ఆమెతో ప్రేమలో ఉన్నాడు.అయితే మహేష్ త్రిష తో ప్రేమలో ఉన్నాడు అనే రూమర్ ఇండస్ట్రీ మొత్తం పాకేయడం తో నమ్రత చెవిన కూడా పడింది.అలాంటిదేమి లేదు అని మహేష్ క్లారిటీ ఇచ్చినా కూడా , ఆమె వినకుండా వెంటనే పెళ్ళికి ఏర్పాట్లు చేయించింది అట.
వాస్తవానికి మహేష్ అప్పటికే పెళ్ళికి సిద్ధం గా లేదు, ఎందుకంటే ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి, క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు, షూటింగ్స్ అన్నీ పూర్తి అయినా తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు.కానీ నమ్రత పట్టుబట్టడం తో వెంటనే మహేష్ పెళ్లి జరిగిపోయింది.షూటింగ్ లో పాల్గొని మరి ఆయన పెళ్ళికి హాజరయ్యాడు.ఈ వార్త అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి.