Assistant Registrar Mitali Sharma: ప్రభుత్వ ఉద్యోగం అంటే లంచాల సంపదనే ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు కొంతమంది. అందుకోసమే సర్కార్ కొలువు కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు కష్టపడితే జీవితాంత సుఖపడొచ్చని ఆలోచిస్తున్నారు. ఈ యువతి కూడా అలాగే ఆలోచించింది. కష్టపడి సర్కార్ కొలువు కొట్టింది. కానీ, ఉద్యోగంలో చేరిన మొదటి రోజే లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికింది. ఈ ఆసక్తికర ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఆ యువతిపేరు మిథాలిశర్.. సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సాధించింది. విధుల్లో చేరిన మొదటి రోజే రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడింది.
తండ్రి స్థానంలో తన పేరు నమోదుకు..
గర్హై్హ గ్రామానికి చెందిన రామేశ్వర్ ప్రసాద్ యాదవ్, తండ్రి దివంగత మంగన్‌యాదవ్ స్థానంలో తన పేరు కోడెర్మ వ్యాపార్ మండల సహయోగ్ సమితిలో దరఖాస్తు చేసుకున్నాడు. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఎంపికైన మిథాలిశర్మ సోమవారం విధుల్లో చేరింది. తొలి రోజే రామేశ్వర్‌ప్రసాద్‌యాదవ్ ఫైల్ ఆమె ముందకు వచ్చింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ను కలవడానికి రామేశ్వర్‌ప్రసాద్‌యాదవ్ అప్పుడే కార్యాలయానికి వచ్చాడు. మిథాలి శర్మ అతనితో మాట్లాడుతూ కొన్ని లోటుపాట్లు బయటకు రాకుండా ఉండటానికి మితాలీ శర్మ 20 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు.
ఏసీబీకి ఫిర్యాదు..
అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ను కలిసి బయటకు వచ్చిన రామేశ్వరప్రసాద్ యాదవ్ వెంటనే ఏసీబీ అధికారులకు ఫోన్‌చేశాడు. వారు డబ్బులు ఇవ్వాలని సూచించారు. వారి సూచన మేరకు అసిస్టెట్ రిజిస్ట్రార్ మిథాలీ శర్మ కార్యాలయానికి వెళ్లాడు. రూ.10వేలు ప్రస్తుతం ఉన్నాయని మిగతావి తర్వాత ఇస్తానని చెప్పాడు. రూ.10 వేలు మిథాలిశర్మకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను హజారీబాగ్‌కు తీసుకెళ్లినట్లే ఏసీబీ అధికారులు తెలిపారు.
లంచంతోనే బోణీ చేద్దామని..
ఉద్యోగంలో చేరిన తొలి రోజే.. మంచి బేరం తగిలిందని మిథాలిశర్మ ఆశించింది. తొలి ఫైల్ ఓకే చేసేందుకు రూ.20 వేలు డిమాండ్ చేసింది. అడిగింది ఇస్తే వెంటనే ఫైల్ క్లియర్ చేస్తానని తెలింపింది. దీంతో బయటకు వచ్చిన బాధితుడు ఏసీబీతో మాట్లాడి తర్వాత రూ.10 వేలు ఇవ్వడంతో బోనీ బాగుందని భావించింది. కానీ ఇంతలోనే ఏసీబీ అధికారులు ఎట్రీ ఇవ్వడంతో షాక్ అయింది. ఉద్యోగం, అధికార హోదా అంటే డబ్బులు డిమాండ్ చేయడమే అనుకున్నట్లు ఉంది మిథాలి. చాలా మంది కూడా ఇలాగే భావిస్తున్నారు. లంచాల కోసం ప్రజలను పీడిస్తున్నారు. ప్రజల పన్నులతో వేతనాలు తీసుకుంటున్నా.. లంచం తీసుకోవడం మాత్రం మానడం లేదు.