
Ashu Reddy Valentine Day Celebrations: అషురెడ్డి తన వాలెంటైన్ డే సెలెస్బ్రేషన్స్ ఫోటోలు షేర్ చేశారు. ఆమె ఒక అనాధాశ్రమంలో ఈ వేడుకలు జరుపుకున్నారు. ‘యూ ఆర్ లవ్డ్ ఫ్రమ్ అషురెడ్డి’ అని కేక్స్ మీద రాయించి… అవి వారి సమక్షంలో కట్ చేశారు. ‘మీ దగ్గర అపరిమిత ప్రేమ ఉన్నప్పుడు… అది దొరక్క బాధపడుతున్న వారికి పంచండి. నా వాలెంటైన్స్ డే వేడుకలు ఇలా జరిగాయి’ అని కామెంట్ పెట్టాడు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ అనే ఆర్ఫాన్ హోమ్ కి వెళ్లిన అషురెడ్డి అక్కడున్న పిల్లలతో గడిపారు.
సాధారణంగా ప్రేమికుల రోజు తమ లవర్ తో ఆహ్లాదంగా గడపాలని అందరూ అనుకుంటున్నారు. అషురెడ్డి మాత్రం అనాధ పిల్లలతో జరుపుకుని మంచి మనసు చాటుకుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఈ కార్యక్రమంలో అషురెడ్డికి కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి తోడయ్యాడు. వీరిద్దరూ హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ హోమ్ ని సందర్శించడం జరిగింది. ఈ క్రమంలో కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. హరి-అషురెడ్డి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న పుకారు ఉంది. రష్మీ-సుడిగాలి సుధీర్ మాదిరి బుల్లితెర లవర్స్ గా ఇమేజ్ తెచ్చుకున్నారు. కలిసి అనేక స్కిట్స్ చేశారు.
అషురెడ్డి పేరును తన గుండెలపై టాటూగా వేయించుకున్నట్లు హరి ఓ సందర్భంలో చెప్పాడు. ఆమె కోసం వేదికపై ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాలెంటైన్స్ రోజు ఇద్దరూ కలవడం, ఆర్ఫాన్ హోమ్లో సెలబ్రేట్ చేసుకోవడంతో నెటిజెన్స్ ఏంటి కథ అని అడుగుతున్నారు. ఆల్రెడీ సింగర్ సిప్లిగంజ్ తో అషురెడ్డి ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది.ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీపై స్పష్టత రావాలంటే కొన్ని రోజులు ఆగాలి. హరి, రాహుల్ లో ఎవరిని అషురెడ్డి సొంతం అవుతుందో అన్న సందేహాలు మొదలయ్యాయి.

ఇక అషురెడ్డి బోల్డ్ ఫోటో షూట్స్, బూతు ఇంటర్వ్యూలతో విమర్శల పాలవుతుంది. ఇటీవల ఓ నెటిజన్.. బాగా ఎక్కువ అవుతుంది తగ్గించని ఆన్లైన్ చాట్ లో కామెంట్ చేశాడు. అతడికి చెప్పు ఎమోజి షేర్ చేసి గట్టి సమాధానం ఇచ్చింది. నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్లు ఉంటానని అషురెడ్డి చెప్పకనే చెబుతున్నారు. అయితే అషురెడ్డి చేస్తున్న సోషల్ సర్వీస్ ఆమెకు పేరు తెస్తుంది. కొందరు విద్యార్థులను సొంత డబ్బులతో చదివిస్తున్నట్లు అషురెడ్డి ఇటీవల వెల్లడించారు. త్వరలో అషురెడ్డి సిల్వర్ స్క్రీన్ మీద కూడా సందడి చేయనున్నారు.