Ashura Holiday 2023: అషుర అంటే ఇస్లాంలో స్మారక దినం. ఇస్లామిక్ సంవత్సరం ముహర్రం లేదా మొహర్రం తోనే ప్రారంభమవుతుంది. ఏడాదిలోని మొదటి నెల ముహర్రం కాగా, జిల్ హజ్జన్ చివరి మాసం. ముహర్రం పేరు వినగానే జ్ఞాపకం వచ్చే మొదటి చారిత్రాత్మక ఘటన కర్బలా మైదానంలో జరిగిన అపూర్వ సంగ్రామం. ఆ సంఘటన అద్వితీయమైనది.. ఖిలాఫత్ వ్యవస్థను సుస్థిరంగా ఉంచేందుకు ఇమామ్ హుస్సేన్ చేసిన మహత్తరమైన త్యాగానికి దానిని ముస్లింలు చిహ్నంగా భావిస్తుంటారు. రాజకీయపరంగా ఇస్లాం ధర్మంలో ఖలీఫా వ్యవస్థ ఉంది, కానీ రాజురిక వ్యవస్థ లేదు. రాజకుమారుడు రాజు కావడం, మంత్రి కుమారుడు మంత్రి కావడం అనే అనువంశిక వ్యవస్థ అసలే లేదు. ఖలీఫా ఎన్నిక మూడు సూత్రాల ప్రకారం.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతుంది. మొదటిది.. మహా ప్రవక్త పాటించిన విధంగా ఎవరినీ ఖలీఫాగా ప్రకటించకూడదు. ప్రజలే ఎన్నుకోవాలి. రెండవది మొదటి ఖలీఫా హజరత్ అబూబకర్ చేసినట్టు.. ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని ఖలిఫాగా సూచించవచ్చు. మూడోవది రెండో ఖలీఫా హజ్రత్ ఉమర్ మాదిరిగా ఖలీఫా ఎన్నికను మేధావులతో కూడిన సలహా సంఘానికి అప్పగించవచ్చు. వారు తమ నుంచి ఒకరిని ఖలీఫా గా ఎన్నుకుంటారు.. కానీ హజరత్ మావియా కుమారుడైన యజీద్ కు యువరాజ పట్టాభిషేకం చేసి, పై మూడు ధర్మ సూత్రాలనూ కాల రాశారు. అప్పటి నుంచే రాజరిక వ్యవస్థ మొదలైంది
ఇక మహమ్మద్ ప్రవక్త కన్నుమూసిన తర్వాత అబూబకర్, హాజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్, నాలుగో ఖలిఫా గా హజరత్ అలీ ఎన్నికయ్యాడు.. ఆ తర్వాత హజరత్ మావియా ఖలీఫా అయ్యారు. అరేబియా దేశాన్ని 19 సంవత్సరాల పాటు పాలించారు. కానీ పుత్ర ప్రేమతో అయోగ్యుడైన, వాట్లకు లోనైన తన కుమారుడు యజీద్ ను యువరాజుగా నియమించారు. యజీత్ ఎన్నిక ఇస్లాం ధర్మ సూత్రాలకు పూర్తిగా వ్యతిరేకం. అది అనువంశిక వ్యవస్థ తప్ప ప్రజాస్వామిక వ్యవస్థ ఎంత మాత్రం కాదు. అందుకే దీనిని ఇమామ్ హుస్సేన్, దైవ ప్రవక్త అనుచరులు బాహాటంగా వ్యతిరేకించారు..
యజీద్ ను రాజుగా ఒప్పుకునేది లేదని తిరుగుబాటు చేశారు. ఒకానొక దశలో ఇమామ్ హుసేన్ తమ దగ్గరకు రావాలని, ఆయనను ఖలీఫా గా గుర్తిస్తామని కూఫా నగర ప్రజలు ఆయనకు అనేకంగా సందేశాలు పంపారు.. ప్రజల తరఫున యజీద్ తో ముఖాముఖి చర్చలు జరిపేందుకు మక్కా పట్టణం నుంచి ఇమామ్ హుస్సేన్ తన 72 మంది ప్రత్యక్ష సహచరులతో, కుటుంబ సభ్యులతో బయలుదేరాడు. వారు కూఫా నగరానికి చేరకముందే తన ప్రభుత్వాన్ని ఇమామ్ హుస్సేన్ గుర్తించేలా చేసేందుకు యజీద్ కుట్రలు పన్నాడు. కానీ యజీద్ ను రాజుగా గుర్తించేందుకు ఆయన ఒప్పుకోలేదు.. తనలో ప్రాణం ఉన్నంతవరకు అధర్మంతో పోరాడుతూనే ఉంటానని, యజీద్ ముందు తలవంచేది లేదని ఆయన బాహాటంగా ప్రమాణం చేశారు. దాని ఫలితమే కర్బలా పోరాటం. ఈ కర్బలా పోరాటంలో ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోయింది. ముహర్రం మాసంలో సంభవించిన అనేక చారిత్రాత్మకమైన సంఘటనలు అనేకం ఉన్నాయి.
మాసంలోనే పదవ రోజైన ప్రధమ దైవ ప్రవక్త స్వర్గంలో ప్రవేశించారు. దైవ ప్రవక్త హాజరత్ ను, ఆయన అనుచరులను అల్లాహ్ నావలో రక్షించి, దుష్టులను శిక్షించింది ఆరోజే. అదేవిధంగా దుర్మార్గుడైన రాజు వల్ల అగ్నిగుండంలో పడిన ప్రవక్త ఇబ్రహీంను కాపాడిందీ, ఫిరౌన్ రాజునూ లక్షలాది సైన్యాన్ని సముద్రంలో ముంచి, దైవ ప్రవక్త మూసానూ, ఆయన అనుచరులని రక్షించింది కూడా ఈ రోజే. దైవ ప్రవక్త మహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ కూడా ఈ మాసంలోని పదవరోజు ప్రాణ త్యాగం చేశాడు. అందుకే ఈ మాసానికి ఇంత ప్రాధాన్యత ఉన్నాయి. అందుకే దీనిని ముస్లింలు అషుర దినంగా, స్మారక రోజుగా జరుపుకుంటారు.