
అషురెడ్డి.. బిగ్ బాస్ తో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన ఈ బ్యూటీ ప్రస్తుతం మాటీవీలో ప్రసారమయ్యే ‘కామెడీ స్టార్స్’ ప్రోగ్రాంలో కమెడియన్ హరి స్కిట్ లో చేస్తోంది. పలు టీవీల్లో కూడా యాంకరింగ్ చేస్తో అలరిస్తోంది.
మొదట అషురెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన అషురెడ్డికి బిగ్ బాస్ చాన్స్ రావడంతో దశ తిరిగింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.
బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ తో బయట రోమాంటిక్ గా క్లోజ్ గా ఉన్న ఈ అమ్ముడు.. బహుషా ప్రేమలో ఉందో అనేలా కలియతిరుగుతోంది. వారిద్దరి మధ్య సంబంధాలపై ఇప్పటికీ అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి..
ఇక తాజాగా అషురెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక డబ్ స్మాష్ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోను షేర్ చేసిన అషు ఇది నిజమే.. నా జీవితంలో జరిగిందని అనడంతో అందరూ అవాక్కయ్యారు..
‘బ్రహ్మానందం’ కామెడీ డైలాగ్ ను డబ్ స్మాష్ గా తీసుకున్న అషురెడ్డి ఒక చిన్న పిల్లల స్కూల్ డ్రెస్ వేసుకొని ఈ వీడియో చేసింది. వెనుకాల కోడైరెక్టర్ రాకేష్, కమెడియన్ ఉన్నాడు. ‘ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడివల్లే నా జీవితం నాశనమైపోయింది.. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పితిప్పి పిప్పి చేశాడు’ అంటూ బ్రహ్మానందం డైలాగ్ తో డబ్ స్మాష్ చేసింది అషురెడ్డి.
అయితే ‘ఇది రియల్’ అని అషురెడ్డి ట్యాగ్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ గా మారింది. అషురెడ్డిని స్కూల్ టైంలో అలా తిప్పి పిప్పి చేసిందెవరు చెప్మా అని ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నీ ఫ్యాష్ బ్యాక్ చెప్పూ అంటూ హోరెత్తిస్తున్నారు.