https://oktelugu.com/

Ashu Reddy : డ్రగ్స్ కేసులో అషురెడ్డి… ఫైనల్లీ రియాక్ట్ అయిన బోల్డ్ బ్యూటీ

ఇదిలా ఉంటే కొందరు టాలీవుడ్ సెలెబ్స్ తో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్ మాట్లాడారు. సురేఖావాణి, అషురెడ్డి, నటి జ్యోతితో కేపీ చౌదరి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. వారితో తరచుగా ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. డ్రగ్ పెడ్లర్ గా పట్టుబడ్డ కేపీ చౌదరితో అషురెడ్డికి ఉన్న అనుబంధం ఎలాంటిదనే చర్చ మొదలైంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2023 / 02:23 PM IST
    Follow us on

    Ashu Reddy : నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అరెస్ట్ తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నాళ్లుగా డ్రగ్ దందా చేస్తున్న కృష్ణ ప్రసాద్ చౌదరికి చిత్ర ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ తో పాటు బిగ్ షాట్స్ తో సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. సెలబ్రిటీ కోసం కేపీ చౌదరి డ్రగ్ పార్టీలు ఏర్పాటు చేస్తారని సమాచారం. కేప్ చౌదరి వద్ద 700లకు పైగా కాంటాక్ట్ నంబర్స్ ఉండగా వాటిలో మూడు వందల కాంటాక్ట్స్ రాజకీయ, సీనీ ప్రముఖులకు సంబంధించినవి. ఇద్దరు పొలిటికల్ లీడర్స్ కూడా కేపీ చౌదరి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నారు.

    ఇక హైదరాబాద్ లోని హయత్ నగర్ లో డ్రగ్ తయారు చేసే ఫెసిలిటీ కూడా ఉందని అంటున్నారు. తవ్వేకొద్దీ డొంక కదులుతుంది. కేపీ చౌదరిది చిన్న నెట్వర్క్ కాదని పోలీసులు అంచనా వేస్తున్నారు. హార్డ్ డిస్క్ లో వేల కొలది కాంటాక్ట్స్, ప్రముఖులతో పార్టీల్లో దిగిన ఫోటోలు ఉన్నాయని తెలుస్తుంది. 12 మందికి డ్రగ్ సప్లై చేసినట్లు కేపీ చౌదరి ఒప్పుకున్నారు.

    ఇదిలా ఉంటే కొందరు టాలీవుడ్ సెలెబ్స్ తో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్ మాట్లాడారు. సురేఖావాణి, అషురెడ్డి, నటి జ్యోతితో కేపీ చౌదరి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. వారితో తరచుగా ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. డ్రగ్ పెడ్లర్ గా పట్టుబడ్డ కేపీ చౌదరితో అషురెడ్డికి ఉన్న అనుబంధం ఎలాంటిదనే చర్చ మొదలైంది.

    పోలీసులు అషురెడ్డికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కలదు. ఆమెను కూడా విచారించనున్నారని విశ్వసనీయ సమాచారం. డ్రగ్ కేసులో తన పేరు వినిపించడంపై అషురెడ్డి స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేశారు. కొందరు వ్యక్తులతో లింక్ పెట్టి కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా నా పేరు లాగుతున్నారు. విచారణ జరుగుతుండగా నిజాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు వేచి చూడకుండా నాకు సంబంధం ఉన్నట్లు రాతలు రాయడం సరికాదన్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదని పరోక్షంగా అషురెడ్డి చెప్పారు.