KP Chaudhary Case: కేపీ చౌదరి కాల్ హిస్టరీలో సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత.. హార్డ్ డిస్క్ లో వేల ఫోటోలు, కాంటాక్ట్స్

సుప్రీత, సురేఖావాణిలు కేపీ చౌదరికి బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తుండగా... వీరికి డ్రగ్ దందాతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతుంది.

Written By: Shiva, Updated On : June 24, 2023 2:48 pm

KP Chaudhary Case

Follow us on

KP Chaudhary Case: కేపీ చౌదరి కేసులో తవ్వేకొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉన్న కేపీ చౌదరి పెద్ద నెట్వర్క్ నడిపాడు. అతడి కాంటాక్ట్ లిస్ట్ లో తొమ్మిది వేలకు పైగా కాంటాక్ట్స్ ఉన్నాయి. అలాగే వేల సంఖ్యలో టాలీవుడ్ ప్రముఖులతో దిగిన ఫోటోలు ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో అషురెడ్డితో పాటు సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత పేర్లు వెలుగులోకి వచ్చాయి. కేపీ చౌదరితో సురేఖావాణి, సుప్రీత అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వీరిద్దరితో కేపీ చౌదరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సుప్రీత, సురేఖావాణిలు కేపీ చౌదరికి బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తుండగా… వీరికి డ్రగ్ దందాతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతుంది. కేపీ చౌదరి కాల్ హిస్టరీలో వీరి ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. పలుమార్లు వీరిద్దరితో కేపీ చౌదరి మాట్లాడాడు. వీరి మధ్య ఎలాంటి సంబాషణలు జరిగాయనే కోణంలో విచారణ జరుగుతుంది. పోలీసులు ఛార్జ్ షీట్లో 12 మంది పేర్లు పొందుపరిచారు.

అనూహ్యంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమె అపార్ట్మెంట్లోనే కొకైన్ తో కూడిన డ్రగ్ పార్టీ జరిగిందట. అయితే ఛార్జ్ షీట్లో ఆమె పేరు లేదు. సిక్కిరెడ్డి గత నెల రోజులుగా హైదరాబాద్ లో లేదని ఆమె ఫాదర్ తెలియజేశారు. ఆమెకు ఈ డ్రగ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు.

పోలీసుల విచారణలో మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది. కేపీ చౌదరి నెట్వర్క్ చూస్తే పెద్దవాళ్ళతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనిపిస్తోంది. ఇప్పటికే అషురెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అషురెడ్డితో కేపీ చౌదరి తరచుగా మాట్లాడతాడని తెలిసింది. కేపీ చౌదరి వద్ద దొరికిన ఆధారాలు, సమాచారం మేరకు మరికొందరిని విచారించే సూచనలు కలవు. 2018లో డ్రగ్ కేసు అనంతరం కేపీ చౌదరి అరెస్ట్ ప్రకంపనలు రేపుతోంది.