
Upasana Delivery: మెగా కోడలు ఉపాసన కొణిదెల కొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. గత ఏడాది ఉపాసన గర్భం దాల్చారు. ఉపాసన మామగారు చిరంజీవి స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఇది అత్యంత సంతోషకర పరిణామంగా అభివర్ణించారు. వివాహమైన పదేళ్లకు ఉపాసన తల్లి కావడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ రోజు కోసం మెగా ఫ్యాన్స్ ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాగా ఉపాసన డెలివరీ విషయంలో ఒక పుకారు తెరపైకి వచ్చింది. చరణ్-ఉపాసన తమ ఫస్ట్ చైల్డ్ బర్త్ అమెరికాలో ప్లాన్ చేస్తున్నారన్న వార్త జోరందుకుంది.
రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనడం ఈ ఊహాగానాలకు కారణమైంది. గుడ్ మార్నింగ్ అమెరికా షోకి రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షోలో డాక్టర్ జెన్ ఆస్టిన్ సైతం పాల్గొన్నారు. జెన్ ఆస్టిన్ ఫిజీషియన్. ఏబీసీ న్యూస్, గుడ్ మార్నింగ్ అమెరికా షోకి ఆమె చీఫ్ మెడికల్ కరస్పాండెంట్. అలాగే డాక్టర్ ఓజ్ షోకి ఉమెన్స్ హెల్త్ కరస్పాండెంట్. ఈ క్రమంలో ఆమె ఆధ్వర్యంలో అమెరికాలో ఉపాసనకు డెలివరీ జరగనుందన్న కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలను ఉపాసన ఖండించారు. తనదైన శైలిలో పుకార్లకు చెక్ పెట్టారు. మా మొదటి బిడ్డ ప్రసవం ఇండియాలో అపోలో హాస్పిటల్స్ లో జరుగుతుంది. డాక్టర్ సుమన, డాక్టర్ మనోహర్, డాక్టర్ రుమా సిన్హాలతో పాటు డాక్టర్ జెన్నిఫర్ ఆస్టిన్ జాయిన్ కానున్నారు. ఈ మూమెంట్ కోసం నేను ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఉపాసన వెల్లడించారు. ఉపాసన డెలివరీ కోసం అమెరికా నుండి డాక్టర్ జెన్నిఫర్ ఆస్టిన్ ఇండియా వస్తున్నట్లు ఉపాసన పరోక్షంగా చెప్పారు.

ఉపాసన-రామ్ చరణ్ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాసన అటు మెగా కోడలిగా ఇటు బిజినెస్ ఉమన్ గా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా ఉపాసన ఉన్నారు. శ్రీమంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడటం అలవరుచుకున్నట్లు ఉపాసన ఇటీవల వెల్లడించారు. నేను పని చేయాల్సిన అవసరం లేదు. అయినా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేస్తున్నానంటూ ఉపాసన చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ తో వివాహం తర్వాత మరింత శ్రమించడం అలవాటైందన్నారు.
Dr Jen Ashton, ur too sweet. Waiting to meet you. Pls join our @HospitalsApollo family in India along with Dr Sumana Manohar & Dr Rooma Sinha to deliver our baby 🤗❤️
A big shout out to all the viewers of @ABCGMA3 & @AlwaysRamCharan ‘s fans & well wishers. U are much loved https://t.co/byeGqOllsK
— Upasana Konidela (@upasanakonidela) February 25, 2023