https://oktelugu.com/

Arjun vs Vishwaksen : ఇలాంటి పనికిమాలిన హీరోతో సినిమా ఒప్పుకున్నందుకు బాధగా ఉంది..విశ్వక్ సేన్ పై అర్జున్ షాకింగ్ కామెంట్స్

Arjun vs Vishwaksen : ఇండస్ట్రీలో సుమారు నాలుగు దశబ్దాల నుండి కొనసాగుతూ యాక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న హీరో హీరో అర్జున్..హీరో గా తెలుగు , తమిళ్ మరియు కన్నడ బాషలలో గొప్పగా రాణించిన అర్జున్..ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా సౌత్ ఇండస్ట్రీ లో గొప్పగా రాణించాడు..అయితే తొలిసారిగా ఆయన డైరెక్టర్ గా మారి తన కూతురు ఐశ్వర్య ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి గ్రాండ్ గా పరిచయం చెయ్యాలనుకున్నాడు. విశ్వక్ సేన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2022 / 10:20 PM IST
    Follow us on

    Arjun vs Vishwaksen : ఇండస్ట్రీలో సుమారు నాలుగు దశబ్దాల నుండి కొనసాగుతూ యాక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న హీరో హీరో అర్జున్..హీరో గా తెలుగు , తమిళ్ మరియు కన్నడ బాషలలో గొప్పగా రాణించిన అర్జున్..ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా సౌత్ ఇండస్ట్రీ లో గొప్పగా రాణించాడు..అయితే తొలిసారిగా ఆయన డైరెక్టర్ గా మారి తన కూతురు ఐశ్వర్య ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి గ్రాండ్ గా పరిచయం చెయ్యాలనుకున్నాడు.

    విశ్వక్ సేన్ ని హీరో గా అనుకున్నాడు..పూజ కార్యక్రమాలు కూడా గ్రాండ్ గా జరిగింది..ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరైయ్యారు..అయితే ఈ సినిమా స్టోరీ లో కొన్నినచ్చక విశ్వక్ సేన్ చివరి నిమిషం లో షూటింగ్ క్యాన్సిల్ చెయ్యండి అని అర్జున్ కి చెప్పడం తో ఆయన ఎంతో మనస్తాపానికి గురై ఈరోజు ఫిలిం ఛాంబర్ లో విశ్వక్ సేన్ పై కంప్లైంట్ చేసాడు.

    ఇక ఆ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పుకొచ్చాడు అర్జున్..ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ నేను అనుకున్నప్పుడు విశ్వక్ సేన్ ని హీరో గా అనుకున్నాను..అతనిని కలిసి స్టోరీ వినిపించిన తర్వాత అద్భుతంగా ఉంది..కచ్చితంగా ఈ సినిమా మనం చేద్దాం సర్ అన్నాడు..అయితే ఇప్పటి వరుకు షూటింగ్ లో పాల్గొనలేదు..నీకు తగట్టుగా ఏమైనా మార్పులు కావాలనుకుంటున్నావా..ఒకసారి స్టోరీ డిస్కషన్ కి రా అని అతనికి ఎన్నో సార్లు ఫోన్లు చేశాను..నా జీవితం లో ఇతనికి ఇచ్చినన్ని మిస్సెడ్ కాల్స్ ఎవ్వరికి ఇవ్వలేదు..రెండు సార్లు షూటింగ్ ని అతని రిక్వెస్ట్ మీద వాయిదా వేసాను..ఈ షెడ్యూల్ లో జగపతి బాబు గారి లాంటి బిజీ ఆర్టిస్ట్స్ డేట్స్ కూడా ఉన్నాయి..ఇతని వల్ల వారి డేట్స్ వేస్ట్ అయ్యాయి’.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నిన్నగాక మొన్న కూడా నవంబర్ 3 నుండి షూటింగ్ పెట్టుకుందాం సార్..నా సినిమాలన్నీ కూడా అయిపోయాయి..నెల రోజులు నాన్ స్టాప్ గా మీకు డేట్స్ ఇస్తున్నాను..ఇదిగో మన సినిమా కోసం హెయిర్ స్టైలింగ్ కూడా చేయించుకున్నాను అంటూ మెసేజి చేసాడు..అంత ఓకే అనుకున్న తర్వాత ఉదయం 5 గంటలకు మెసేజి చేసి షూటింగ్ ఆపేయండి ప్లీజ్ అన్నాడు..ఇది నా కెరీర్ లో ఎప్పుడూ జరగనటువంటి అవమానం..ఇంత కేర్ లెస్ హీరో ని నేను ఎప్పుడూ చూడలేదు..రామ్ చరణ్,ఎన్టీఆర్,అల్లు అర్జున్ లాంటి హీరోలకు ఎంతో డిసిప్లిన్ ఉంటుంది..అంత పెద్ద స్టార్స్ అయ్యుండి కూడా వాళ్ళు తమ డిసిప్లైన్ ని వదులుకోలేదు..అలా ఉండాలి..సౌత్ లో ఎంతోమంది స్టార్ హీరోస్ తో కలిసి పని చేశాను..కానీ ఇలాంటి అనుభవం నాకు ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ రాలేదు..ఇతనితో ఇక ఎప్పుడూ సినిమాలు చెయ్యను’ అంటూ అర్జున్ చాలా బావోద్వేగంగా ప్రెస్ మీట్ లో మాట్లాడాడు.