Somalian Bananas: అరటిపండు చూడటానికి అందంగా ఉంటుంది. తొక్కతో మెరుస్తుంది. అరటిపండులో పోషకాలు మెండు. అందుకే దీన్ని ఎక్కువ మంది తీసుకుంటారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో తరచుగా అరటి పండును తింటుంటారు. అరటిపండుతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇటీవల దీనిపై ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అరటిపండు తింటే చనిపోతారని ఓ ఫేక్ వార్త అందరిని కలవరపెడుతోంది. దీన్ని తింటే పన్నెండు గంటల్లో మనుషులు చనిపోతారనేది దీని సారాంశం.

సోమాలియా దేశంలో పండించే అరటిపండ్లలో ఉండే బ్యాక్టీరియాతో మనుషుల ప్రాణాలు పోతున్నాయని చెబుతున్నారు. సోమాలియా నుంచి 500 టన్నుల అరటిపండ్లు దిగుమతి చేసుకున్నాం. ఇందులో హెలికోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా ఉందని కనుగొన్నారు. ఇది వానపాములా ఉందని చెబుతున్నారు. దీంతో మనుషుల ప్రాణాలు పన్నెండు గంటల్లోనే పోతాయని తెలుస్తోంది. కానీ ఇంతవరకు ఏ ఒక్క ఘటన జరగకపోయినా సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుండటంతో అందరిలో భయం పట్టుకుంటోంది.
Also Read: Car Washer In Dubai: కారు క్లీన్ చేసే వ్యక్తికి మారిన ఫేట్.. ఆ దెబ్బకు ఏకంగా కోట్లలో లాటరీ..
ట్విట్టర్ లో కూడా దీనికి సంబంధించిన వార్త వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పనికి రాని విషయాలకు ప్రచారం జరగడం సాధారణమే. కానీ ఓ పండు విషయంలో ఇలా జరగడం ఆశ్చర్యకరం. ఈ బ్యాక్టీరియా గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోతాయని చెప్పడం గమనార్హం. దీన్ని పలువురు శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. అరటిపండులో ఎలాంటి ముప్పు లేదని అనవసర భయాలు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అరటిపండు పోషకాలతో నిండింది కాబట్టి దానిపై ఇలాంటి దుష్ర్రచారాలు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. పుణేకు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు ప్రకారం హెలికోబ్యాక్టర్ ప్రాణాలు తీసే బ్యాక్టీరియా కాదని చెబుతున్నారు. ఇది క్యాన్సర్ కు కారణమవుతుందని తెలిసినా మనిషి ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైనది కాదని సూచిస్తున్నారు.

నోబెల్ బహుమతి పొందిన వారు కూడా అరటిపండులో ఎలాంటి హానికరమైనవి లేవని చెబుతున్నారు. ప్రజల్లో ఏవో భయాలు సృష్టిస్త పక్కదారి పట్టించడం సబబు కాదని తెలిసినా సామాజిక మాధ్యమాల పుణ్యమాని ఇలాంటి ప్రచారాలు కరెక్టు కాదని చెబుతున్నారు. అరటిపండును ఆరోగ్యానికి మరో రూపంగా చూస్తారే కానీ ఇలా బ్యాక్టీరియాతో కూడుకుందని లేనిపోని ప్రచారాలు చేయడం అసమంజసం. భవిష్యత్ లో కూడా ఇలాంటి పుకార్లు నమ్మకుండా పండ్లను మన ఆరోగ్యం కోసం తినేందుకు సిద్ధపడాల్సిందేనని చెబుతున్నారు.
Also Read: NTR- Babu Gogineni: జూ.ఎన్టీఆర్ పై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు.. తారక్‌పై ‘బాబు’గారి దండయాత్ర