https://oktelugu.com/

AR Rahaman: ఏఆర్ రెహమాన్ సంగీతం చేయడు.. అవన్నీ వేరే వాళ్ల ట్యూన్స్?

AR Rahaman: ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన సంగీతం నుంచి జాలువారే ఆ సుస్వారాల విందును దేశ, విదేశ ప్రజలు ఎంజాయ్ చేస్తారు. చాలా కష్టపడి పైకి వచ్చిన రెహమాన్ తమిళ ఇండస్ట్రీలో ఎదిగారు. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించారు. ఇప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఏఆర్ రెహమాన్ గుట్టు బయటపడింది. ఆయనతో సినిమా అంటే దర్శక నిర్మాతలు పారిపోతున్న పరిస్థితి. అస్సలు ట్యూన్స్ ఇవ్వడని.. సంగీతం ఆలస్యం చేస్తాడని.. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 31, 2022 10:26 am
    Follow us on

    AR Rahaman: ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన సంగీతం నుంచి జాలువారే ఆ సుస్వారాల విందును దేశ, విదేశ ప్రజలు ఎంజాయ్ చేస్తారు. చాలా కష్టపడి పైకి వచ్చిన రెహమాన్ తమిళ ఇండస్ట్రీలో ఎదిగారు. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించారు. ఇప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఏఆర్ రెహమాన్ గుట్టు బయటపడింది. ఆయనతో సినిమా అంటే దర్శక నిర్మాతలు పారిపోతున్న పరిస్థితి. అస్సలు ట్యూన్స్ ఇవ్వడని.. సంగీతం ఆలస్యం చేస్తాడని.. సినిమాలకు మన దక్షిణాదిన తీసుకోవడమే మానేశారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ కచేరిలు చేసుకుంటూ ఇండియాలోని సినిమాలకు వేరే వాళ్ల చేత ట్యూన్స్ ఇప్పిస్తున్నాడని సంచలన నిజాలు వెలుగుచూశాయి. ఈ మేరకు రాంగోపాల్ వర్మ చెప్పిన ఒక ఉదాహరణ ఇప్పుడు రెహమాన్ గుట్టు బయటపెట్టింది. తన బ్రాండ్ పేరుతో ఇతర చిన్న సంగీత దర్శకుల నుంచి ట్యూన్స్ తీసుకొని వారికి డబ్బులిచ్చి అమ్ముకుంటాడన్న షాకింగ్ నిజం బట్టబయలైంది. ఇదిప్పుడు వైరల్ గా మారింది.

    AR Rahaman

    AR Rahaman

    ఏ.ఆర్. రెహమాన్ ఫేడ్ అయిపోవడానికి కారణం ఆయన ట్యూన్స్ చేయడం లేదని తేలింది.. ఆయన చేసే మ్యూజిక్ మొత్తం ఇతరులవేనని, వారి సంగీతాన్ని తీసుకొని తన పేరు వాడుకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇతరుల మ్యూజిక్ వాడుకొని వారికి ఎంతో కొంత ఇచ్చి తన పేరును గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. ఇటీవల ఆయన ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆర్జీవి లెటేస్టుగా మరోసారి ఈ బాంబు పేల్చారు.

    దేశవ్యాప్తంగా ఆస్కార్ పొందిన సంగీత డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఏఆర్ రెహమాన్ కొన్ని సినిమాలకు ఇతరులతో మ్యూజిక్ కంపోజ్ చేయిస్తాడని వర్మ తెలిపారు.. ఆ మ్యూజిక్ కు తన పేరు వాడేసుకుంటాడనని అన్నారు. ఒకసారి బాలీవుడ్ మూవీ ‘యువరాజ్’ సినిమా విషయంలో ఈ విషయం బయటపడిందని ఆర్జీవి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లో ‘సుభాష్ డైరెక్షన్లో ‘యువరాజ్’ సినిమా వచ్చిందని.. ఈ సినిమా రెహమాన్ సంగీత దర్శకుడు. సల్మాన్ ఖాన్ సినిమా చేస్తున్న సుభాష్.. సెట్స్ రెడీగా ఉంది.. సాంగ్ ఇస్తే తీస్తాను అంటూ రెహమాన్ ను ఒత్తిడి చేశాడు. దీనికి విదేశాల్లో ఉన్న రెహమాన్ ముంబైలోని సుఖివిందర్ స్టూడియోకు రండి అని చెప్పారని’ ఆర్జీవి తెలిపారు..

    Also Read: CM KCR- China Jeeyar: చిన‌జీయ‌ర్ వ‌ద్దు.. కొత్త గురువు అత‌నేనంటున్న కేసీఆర్.. అంతా వ్యూహం ప్ర‌కార‌మే..

    ‘అయితే రెహమాన్ కంటే ముందే సుభాష్ సుఖివిందర్ సింగ్ స్టూడియోకు వెళ్లాడు. అయితే అక్కడ సుఖివిందర్ సింగ్ ఓ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఎవరికోసం ఆ మ్యూజిక్ అని అడగ్గానే.. ‘మీ సినిమా కోసమే.. రెహమాన్ చెప్పాడు అందుకే కంపోజ్ చేస్తున్నా..’ అని అనడంతో సుభాష్ కు విపరీత కోపం వచ్చింది. ఇంతలో అక్కడికి రెహమాన్ వచ్చాడు. రెహమాన్ ను మ్యూజిక్ గురించి సుభాష్ ప్రశ్నించాడు. సుఖివింద్ సింగ్ కంపోజ్ చేసిన దానిని వినిపించాడు. దీంతో సుభాష్ కు విపరీతమైన కోపం వచ్చింది. ‘నేను నీకు మూడు కోట్ల రూపాయలతో మ్యూజిక్ చేయిస్తుంటే.. నువ్వు సుఖివింద్ తో చేయిస్తావా… నేను చేయించుకోలేనా..? అని దర్శకుడు సుభాష్ ఫైర్ అయ్యాడు.

    ‘అంటే ఇక్కడ రెహమాన్ కూడా హాట్ గా రిప్లై ఇచ్చారు. మీరు నాకిచ్చే మూడు కోట్ల రూపాయలు కేవలం నాకున్న పేరుకే.. నేనిచ్చే మ్యూజిక్ కోసం కాదని చెప్పాడు. నేను మ్యూజిక్ ఎక్కడైనా చేయిస్తా.. కానీ నా పేరు వేస్తున్నా.. ఆ పేరు కోసమే నాకు డబ్బులిస్తున్నారు. మీకు మంచి మ్యూజిక్ కావాలి.. మీకు నచ్చేలా మ్యూజిక్ ఇస్తాను.. అది ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు.. అని చెప్పడంతో రెహమాన్ మ్యూజిక్ చేయడని.. ఎవరో చేసింది తీసుకొని అమ్ముకుంటాడన్న విషయం అప్పుడే బయటపడింది.

    కొన్ని రోజుల తరువాత సుఖిందర్ చేసిన ఆ ‘జయహో’ సాంగ్ ను ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కోసం వాడాడు.. తన డ్రైవర్ తో సుఖిందర్ సింగ్ కు రూ.5 లక్షలు పంపించాడు. సుభాష్ కు ఇవ్వాల్సిన పాట స్లమ్ డాగ్ కు వెళ్లింది. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే.. ఆ పాట స్లమ్ డాగ్ మిలియనీర్లోని ‘జయహో’ సాంగ్..’ ఈ సాంగ్ సుఖింద్ చేస్తే రెహమాన్ తన పేరును వాడుకున్నాడు.. ఈ విషయం నాకు సుఖిందర్ చెప్పాడని వర్మ హాట్ కామెంట్స్ చేశారు.. అంటే రెహమాన్ ఓన్లీ తన పేరు కోసమే డబ్బు తీసుకుంటున్నాడు.. రెహమాన్ ఇచ్చేమ్యూజిక్ తనది కాదని అర్థమైంది. ఇతరులది వాడుతున్నాడని తేలింది… ఇక ఇతరుల నుంచి తీసుకున్న ట్యూన్ కు వేరే చోట ఎక్కువ రేటుకూ అమ్ముకుంటున్నాడని రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రెహమాన్ సంగీతం చేయడని.. వర్ధమాన సంగీత దర్శకులతో చేయించి అమ్ముకుంటున్నాడని విషయం తేలింది. అందుకే ఆయనకు అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది.

    Also Read: Mahesh- Rajamouli Movie: మహేష్ – రాజమౌళి సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ?