Anushka Shetty Marriage: స్టార్ హీరోలకు సమానమైన స్టార్డం అనుష్క సొంతం. సౌత్ ఇండియాలో ఆమెకు భారీ ఫేమ్ ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అనుష్క ను అమితంగా ఇష్టపడతారు. అనుష్క డౌన్ టు ఎర్త్ నేచర్ కూడా జనాలు ఇష్టపడటానికి కారణం. ఆమె దర్శక నిర్మాతల హీరోయిన్. ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క స్వతహాగా స్వీటీనే. అయితే ఆమె అభిమానులు ఓ విషయంలో తీవ్ర నిరాశ చెందుతున్నారు. వయసు మీదపడుతున్నా పెళ్లి చేసుకోకపోవడంతో ఫ్యాన్స్ వేదనకు గురవుతున్నారు. అనుష్క ప్రస్తుత వయసు 41 ఏళ్ళు కాగా… పెళ్లి వయసు ఎప్పుడో దాటిపోయింది.

ఇక ప్రభాస్ ని ఆమె వివాహం చేసుకోనున్నారని, ఆయన కోసం ఎదురు చూస్తున్నారనే వాదన ఉంది. ప్రభాస్-అనుష్క రిలేషన్ లో ఉన్నారన్న ప్రచారం గత ఐదేళ్లుగా పెద్ద ఎత్తున జరుగుతుంది. వరుస కథనాల నేపథ్యంలో ప్రభాస్, అనుష్క స్పందించారు. ప్రేమ, పెళ్లి పుకార్లను కొట్టిపారేశారు. తాము మిత్రులం మాత్రమే, అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదంటూ స్పష్టత ఇచ్చారు. ప్రభాస్, అనుష్కలకు పెళ్లి కాకపోవడం ఎఫైర్ వార్తలకు బలం చేకూర్చింది.
అయితే ఎట్టకేలకు ఆమె వివాహం గురించి ఒక శుభవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 2023లో అనుష్క పెళ్లి ఖాయం అంటున్నారు. ఆమె జాతకరీత్యా ఇది అనివార్యం అంటున్నారు. ప్రముఖ గురూజీ పండిత్ జగన్నాథ్ అనుష్క జాతకం పరిశీలించి ఈ విషయం నిర్ధారించారు. అనుష్కకు పెళ్లి ఘడియలు సమీపించాయి. 2023లో ఆమె వివాహం జరుగుతుంది. ఇక అబ్బాయి పరిశ్రమ వాడు మాత్రం కాదు. సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తితో అనుష్క ఏడడుగులు వేస్తారు. అని వెల్లడించారు.

వివాహం అనంతరం అనుష్క జీవితం ఎలా ఉంటుందో కూడా పండిట్ జగన్నాథ్ గురూజీ వెల్లడించారు. అనుష్క సంసార జీవితం అన్యోన్యంగా సాగుతుంది. బార్యాభర్తలు కలిసి మెలిసి అవగాహనతో అందమైన జీవితం గడుపుతారని వెల్లడించారు. కాగా బాహుబలి 2 అనంతరం అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి జంటగా న్యూఏజ్ రొమాంటిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.