Anushka Sharma: ఇంత జరుగుతున్నా అన్ని ప్రశ్నలు ఆమెనే ఎత్తి చూపిస్తున్నాయి… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనుష్క శర్మ పోస్ట్

కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలు హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో బాధిత కుటుంబానికి సంఘీభావంగా, జరిగిన దారుణాన్ని ప్రశ్నించే గళంగా ఉండాల్సిన సెలబ్రిటీలు మౌనం పాటిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 17, 2024 12:16 pm

Anushka Sharma

Follow us on

Anushka Sharma: పాలస్తీనాలోని గాజానగరంపై దాడులు జరుగుతే మనదేశంలో కొంతమంది సెలబ్రిటీలు స్పందిస్తుంటారు. రఫా ప్రాంతంపై బాంబు దాడులు జరిగితే.. మనదేశంలో జరిగినట్టుగా కొంతమంది బాధపడిపోతుంటారు. కానీ మనదేశంలో జరిగే (బీజేపీయేతర రాష్ట్రాలు) అకృత్యాలను, అన్యాయాలను అస్సలు ప్రశ్నించారు. అదే బిజెపి పరిపాలిత రాష్ట్రాలలో ఏదైనా జరిగితే దానిని భూతద్దంలో పెట్టి చూస్తారు. సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తుంటారు. అది వల్ల భావ దారిద్ర్యం. దానికి చిందించడం తప్ప.. మనం చేసేదేమీ లేదు. అయితే ఈ కేటగిరీలో కొంతమంది డిఫరెంట్ గా ఉంటారు. ఎలాంటి సంఘటన జరిగినా తమదైన శైలిలో స్పందిస్తారు. ఆ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టుకున్న ఒక స్టేటస్ ఇప్పుడు పెను సంచలనానికి కారణమవుతోంది.

కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలు హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో బాధిత కుటుంబానికి సంఘీభావంగా, జరిగిన దారుణాన్ని ప్రశ్నించే గళంగా ఉండాల్సిన సెలబ్రిటీలు మౌనం పాటిస్తున్నారు. అదే పాలస్తీనా పై దాడులు జరిగినప్పుడు, ఇంకోచోట ఇంకో సంఘటనలు జరిగినప్పుడు స్పందించిన వారు.. ఈ విషయంలో మాత్రం ఆంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బహుశా మమతా బెనర్జీ తన రాష్ట్రంలో థియేటర్లలో సినిమాలు విడుదల చేసుకోనివ్వదనే భయం కావచ్చు.. మరింకేదైనా కావచ్చు. కాకపోతే సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న వారికి సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఆ సమాజం వారిని నెత్తిన పెట్టుకుంది కాబట్టి.. వారికి సెలబ్రిటీ హోదా ఇచ్చింది కాబట్టి.. అయితే అనుష్క శర్మ ఆ చట్రంలో బంధీ కాకుండా నేరుగా స్పందించింది. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించింది. సమాజంలో పేరుకుపోతున్న దారుణాన్ని ఎండగట్టింది. అయితే ఆమె ప్రశ్నించడం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా? అంతటి ప్రభావం ఆమె చూపించగలుగుతుందా? అనే ప్రశ్నలు ఇక్కడ ఇమడవు. ఎందుకంటే అన్యాయాన్ని ప్రశ్నించ లేనప్పుడు, దారుణాన్ని నిలదీయలేనప్పుడు సెలబ్రిటీలకు ఆ హోదా అనుభవించే హక్కు లేదు.

అనుష్క శర్మ ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలను తనదైన శైలిలో వ్యక్తికరించింది. “నెలలు నిండని పసి కందు నుంచి 82 సంవత్సరాల వృద్ధురాలి వరకు.. అన్నిచోట్ల ఆమె బాధితురాలు. ఆమె ఆ చేతనురాలు. ఆమె ఆశక్తురాలు. ఇబ్బంది పడుతున్నప్పటికీ, హింసను ఎదుర్కొంటున్నప్పటికీ ఆమె ప్రశ్నించలేదు. ఆమె బాధితురాలైనప్పటికీ పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఇంత జరుగుతున్నా.. అన్ని ప్రశ్నలు ఆమెను ఎత్తి చూపిస్తున్నాయి. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇప్పటికైనా మనం మేల్కొందాం. ఆమెను ఆమెలాగా బతకనిద్దాం. సమాజం ఏ కాస్త త్వరగా చూపిన ఆమె బాగుపడుతుంది. బతుకుతుంది. బతుకునిస్తుందని” అనుష్క శర్మ తన స్టేటస్ లో పేర్కొంది. ఇది కాస్త ఒకసారిగా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. చాలామంది దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.. అయితే ఇటీవల కాలంలో సమాజంలో చోటు చేసుకున్న దారుణానికి సంబంధించి ఒక సెలబ్రిటీ ఈ స్థాయిలో స్పందించడం ఇదే ప్రథమం అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.