Anupama Parameswaran: ఈ ఏడాది ప్రారంభం లో చిన్న సినిమాగా మొదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో ఒకటి ‘DJ టిల్లు’..సిద్దు జొన్నలగడ్డ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రానికి యూత్ నీరాజనాలు పలికారు..ఈ సినిమాకి ముందు అడపాదడపా పలు సినిమాల్లో హీరో గా నటిస్తూ, మళ్ళీ క్యారక్టర్ ఆర్టిస్టు గా, విలన్ గా నటిస్తూ వచ్చిన సిద్దు, ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు..ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ అంటే యూత్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.

ఆయనకీ అంతటి ఇమేజి ని తెచ్చిపెట్టిన సినిమాకి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు..పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యింది కానీ ఇప్పటి వరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు..కారణం హీరోయిన్ దొరకకపోవడమే..ఈ సినిమాని ఒప్పుకున్న హీరోయిన్స్ అందరూ వెంటనే తప్పుకోవడం కూడా చేస్తున్నారు..ఎందుకు వాళ్ళు అలా ఈ సినిమా అంటేనే బయపడి పారిపోతున్నారు అనేది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.
ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి తప్పుకున్న హీరోయిన్స్ శ్రీ లీల , మడోనా సెబాస్టియన్ మరియు మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్స్ తప్పుకున్నారు..ఇప్పుడు లేటెస్ట్ గా ఆ జాబితాలోకి అనుపమ పరమేశ్వరన్ కూడా చేరింది..ఈమె హీరోయిన్ గా దాదాపుగా ఖరారు అయ్యింది..ఈ విషయాన్నీ సిద్దు కూడా అధికారికంగా తెలియ చేసాడు కూడా..కానీ షూటింగ్ స్పాట్ లో అనుపమ మరియు సిద్దు మధ్య గొడవలు జరిగాయట..వెంటనే ఆ ప్రాజెక్ట్ నుండి ఆ క్షణమే ఆమె వాక్ అవుట్ చేసినట్టు ఇండస్ట్రీ లో జోరుగా ప్రచారం సాగుతుంది..అయితే అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సినిమాలో నిఖిల్ హీరో గా నటించాడు.

అయితే ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా అనుపమ పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది..ఈ ఇంటర్వ్యూస్ లో యాంకర్స్ టిల్లు స్క్వేర్ మూవీ గురించి అడగగా , అనుపమ అందుకు స్పందిస్తూ ‘ఇప్పుడు మనం 18 పేజెస్ సినిమా గురించి మాట్లాడుకోవడానికి వచ్చాము..దయచేసి దాని గురించే మాట్లాడండి’ అంటూ సమాధానం దాటివేసింది..కనీసం ఆ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడడానికి అనుపమ ఇష్టపడడం లేదంటే ఎంత పెద్ద గొడవ జరిగి ఉంటుందో అని అభిమానులు ఆరా తీస్తున్నారు.