Homeట్రెండింగ్ న్యూస్Viral Video : చీమలే అని చులకన వద్దు.. పారే నీటిలో వంతెన కూడా కట్టేస్తాయి.....

Viral Video : చీమలే అని చులకన వద్దు.. పారే నీటిలో వంతెన కూడా కట్టేస్తాయి.. వీడియో వైరల్

Viral Video :  ఏగతాటిపై నిలిస్తే.. కలసికట్టుగా పనిచేస్తే విజయాలు సాధించవచ్చని… కష్టాలను ఎదిరించవచ్చని.. రామాయణ కాలంలో వానరాలు నిరూపించాయి. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో చీమలు అద్భుతాన్ని చేసి చూపించాయి. చీమల్లో అనేక రకాలు ఉన్నాయి. అందులో గండు చీమలు చాలా బలవంతమైనవి. వీటికి తెలివితేటలు, జ్ఞాపకశక్తి, కష్టపడి పనిచేసే విధానం ఎక్కువగా ఉంటుంది. ఇవి మైదాన ప్రాంతంలో పుట్టలు పెట్టగలవు. ఆ పుట్టలో దూరిన పాములను కూడా సంయుక్తంగా చంపేయగలవు. ఇక పారే నదిలోనూ.. నీటి నిల్వ ప్రదేశంలోనూ.. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు రాకపోకలు సాధించేందుకు తాత్కాలికంగా వంతెన కూడా ఏర్పాటు చేసుకోగలవు. అంతటి ప్రవాహంలోనూ ఈ చీమలు నిర్మించిన వంతెన చెక్కుచెదరకుండా ఉంటుంది. రాకపోకలు సాగించడానికి అత్యంత అనువుగా ఉంటుంది. అందువల్లే వీటి మీదుగా ప్రయాణించి చీమలు ఆహారాన్ని సేకరిస్తాయి. అలా సేకరించిన ఆహారాన్ని భద్రంగా దాచుకుంటాయి. విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు.. కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకున్నప్పుడు చీమలు తాము భద్రపరచుకున్న ఆహారాన్ని బయటకి తీసుకొని తింటాయి.

వంతెన కట్టేసాయి

తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. పారే నదిలో చీమలు కట్టిన వంతెన ఆసక్తికరంగా దర్శనమిస్తోంది. అచంచలమైన క్రమశిక్షణ.. కట్టుదిట్టమైన ఐకమత్యం.. ఉత్సాహాన్ని రేకెత్తించే శ్రమైక జీవనం చీమలను ప్రత్యేకంగా నిలుపుతోంది. వీటి ద్వారానే గండు చీమలు తమ ఆశయ సాధనను నిరూపించాయి. పట్టుదలలో మనుషులకు గొప్ప సందేశాన్నిచ్చాయి. దట్టమైన అడవి ప్రాంతంలో.. విస్తారంగా నీరు పారుతోంది. ఆ ప్రాంతంలో ఆహారాన్ని సేకరించడానికి అడ్డుగా నీరు ఉండడంతో.. చీమలు సమీపంలో దొరికిన మట్టిని సంయుక్తంగా తీసుకెళ్లి ఏకంగా వంతెన నిర్మించాయి. ఆ వంతెనను కూడా కేవలం రోజుల వ్యవధిలోనే పూర్తి చేశాయి. ఆ తర్వాత అట్నుంచి ఇటు, ఇటునుంచి అటు ప్రయాణించడం మొదలుపెట్టాయి. భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారాన్ని సేకరించాయి. సేకరించిన ఆహారాన్ని జాగ్రత్తగా భద్రపరిచాయి. చెట్ల మీదకెక్కి పువ్వుల రెమ్మలను.. ధాన్యపు గింజలను.. రాలిన పండ్ల విత్తనాలను సేకరించి పుట్టల్లో దాచుకున్నాయి. చీమలు నిర్మించిన వంతెనను ఓ ఫోటోగ్రాఫర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు. ఇప్పటివరకు ఆ వీడియోకు 700K వ్యూస్ వచ్చాయి. ” ఇది మామూలు విషయం కాదు.. ఇది ఎనిమిదవ వింత. మనుషులు చాలా నేర్చుకోవాలి. ఆ చీమలను చూస్తుంటే ఐకమత్యం ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతుంది. చిన్న ప్రాణులు అంతటి ఐకమత్యాన్ని చూపిస్తుంటే.. మనుషులు మాత్రం ఏకాకుల్లాగా జీవిస్తున్నారు. స్వార్ధాన్ని, మోసాన్ని ప్రయోగిస్తూ ఎదుటి మనుషులను నాశనం చేస్తున్నారని” ఆ ఫోటోగ్రాఫర్ పేర్కొన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version