Rashmika Mandanna: సౌత్ చిత్రాలతో స్టార్ డమ్ తెచ్చుకున్న రష్మిక మందాన బాలీవుడ్ లో స్థిరపడాలని ఫిక్స్ అయ్యింది. అక్కడ ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఇక సౌత్ తో నాకు పని లేదన్నట్లు ప్రవర్తిస్తుంది. సౌత్ చిత్రాలను ఉద్దేశిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేస్తుంది. నార్త్ ఆడియన్స్ సౌత్ చిత్రాలను నెత్తిన పెట్టుకుంటే ఈమేమో చులకనగా మాట్లాడుతుంది. కాంతార చిత్రం చూడలేదని చెప్పిన రష్మిక… మిషన్ మజ్ను ప్రమోషనల్ ఈవెంట్లో సౌత్ మ్యూజిక్ ని కించపరిచింది.

నేను చిన్నప్పటి నుండి బాలీవుడ్ మ్యూజిక్ వింటూ పెరిగాను. రొమాంటిక్, మెలోడీ సాంగ్స్ అంటే బాలీవుడ్ గుర్తుకు వస్తుంది. సౌత్ మ్యూజిక్ అంతా మాస్ మసాలా ఐటెం సాంగ్స్ మాత్రమే అని అనుచిత కామెంట్స్ చేసింది. రష్మిక కామెంట్స్ విమర్సలపాలయ్యాయి. రష్మికకు మ్యూజిక్ గురించి ఏం తెలుసని మాట్లాడుతుందంటూ పలువురు చురకలు వేశారు. ఆల్రెడీ తన సొంత పరిశ్రమ శాండిల్ వుడ్ తో రష్మికకు విబేధాలు కొనసాగుతున్నాయి. తన నోటి దురుసు చూపిస్తూ మొత్తంగా సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమను గెలికే ప్రయత్నం చేసింది.
అయితే బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలన్న ఆమె కల చెదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె చేసిన రెండు స్ట్రెయిట్ బాలీవుడ్ చిత్రాలు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. గుడ్ బై సోదిలో లేకుండా పోయింది. అమితాబ్ ఈ మూవీలో కీలక రోల్ చేశారు. గుడ్ బై చిత్రానికి కనీస ఆదరణ దక్కలేదు. డిజాస్టర్స్ ఖాతాలో చేరిపోయింది.

తాజాగా మిషన్ మజ్ను మూవీతో ప్రేక్షకులను పలకరించింది. నెట్ఫ్లిక్స్ లో నేరుగా మిషన్ మజ్ను చిత్రాన్ని విడుదల చేశారు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన మిషన్ మజ్ను మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. గతంలో అలియా భట్ నటించిన రాజి చిత్రంతో పోల్చుతూ మిషన్ మజ్ను లో విషయం లేదని తేల్చేశారు. దీంతో రష్మిక రెండో చిత్రం కూడా విఫలం చెందింది. ప్రస్తుతం రష్మిక ఖాతాలో ఉన్న హిందీ ప్రాజెక్ట్ యానిమల్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక యానిమల్ పైనే రష్మిక బాలీవుడ్ కెరీర్ ఆధారపడి ఉంది. ఆమె లేటెస్ట్ సౌత్ రిలీజ్ వారసుడు డివైడ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ మేనియాతో కేవలం వసూళ్లు రాబడుతుంది.