spot_img
Homeట్రెండింగ్ న్యూస్IT Employees: ఐటీ లో మరో సంచలనం.. ఉద్యోగులందరూ ఇది తెలుసుకోవాల్సిందే!

IT Employees: ఐటీ లో మరో సంచలనం.. ఉద్యోగులందరూ ఇది తెలుసుకోవాల్సిందే!

IT Employees: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఐటీ కంపెనీలు ఇన్నాళ్లూ ఉద్యోగాల్లో కోత విధిస్తూ వచ్చాయి. పెద్దపెద్ద కంపెనీలు సైతం ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఈ క్రమంలో మరో కొత్తమార్గాన్ని ఎంచుకున్నాయి టెక్‌ కంపెనీలు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ వంటి దిగ్గజ కంపెనీలు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి.

IT Employees
IT Employees

ఆఫీసులు ఖాళీ..
ఖర్చుల మదింపు చర్యలను టెక్‌ దిగ్గజ కంపెనీలు సైతం ఫాలో అవ్వటం మెుదలు పెట్టాయి. ఇందులో భాగంగా.. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ డౌ¯Œ టౌన్‌ సీటెల్‌లోని ఆరు అంతస్తుల భవనాన్ని, బెల్లేవ్‌లోని స్ప్రింగ్‌ డిస్ట్రిక్ట్‌లోని 11 అంతస్తుల బ్లాక్‌ 6లో తన కార్యాలయాలను సబ్‌లీజ్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్‌ సైతం వాషింగ్టన్, బెల్లేవ్‌ ఆఫీసులను ఖాళీ చేయాలని నిర్ణయించింది.

సాఫ్ట్‌ మార్కెట్‌..
సాఫ్ట్‌ మార్కెట్‌ అనేది ఆర్థిక చక్రంలో ఒక దశ. ఈ క్రమంలో కొనుగోలుదారులు తక్కువగా ఉండటంతో వారి వ్యాపారాన్ని పొందేందుకు.. ఎక్కువ మంది విక్రేతలు ఉంటారు. అందుకే ప్రఖ్యాత కంపెనీలు ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తమ కార్యాలయ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మైక్రోసాఫ్ట్‌ 2024తో ముగియనున్న బెల్లేవ్‌లోని 26 అంతస్తుల సిటీ సెంటర్‌ ప్లాజా భవన లీజును తిరిగి పునరుద్ధరించందని తెలుస్తోంది.

IT Employees
IT Employees

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..
ఆఫీసులను ఐటీ కంపెనీలు ఖాలు చేస్తున్న క్రమంలో టెక్‌ దిగ్గజాలు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అందించాలని నిర్ణయించాయి. రిమోట్‌ విధానంలో ఉద్యోగులకు పనిచేసే వెసులుబాటును అందిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగాల కోత కొనసాగిస్తున్నాయి. ఆఫీస్‌లను సబ్‌ లీజ్‌కు ఇవ్వడం ద్వారా ఆదాయం వస్తుందని, నిర్వహణ ఖర్చు తగ్గుతుందని బడా కంపెనీలు భావిస్తున్నాయి. లీజింగ్‌ నిర్ణయాలు ఉద్యోగులకు ఎక్కడి నుంచైనా పనిచేసేందుకు వీలుకల్పించినందున తీసుకున్నట్లు మెటా ప్రతినిధి ట్రేసీ క్లేటన్‌ సీటెల్‌ వార్తా పత్రికలకు వెల్లడించారు. దీంతో కంపెనీలు తమను తాము కాపాడుకునేందుకు మారిన ఆర్థిక పరిస్థితుల్లో ఎంత కష్టపడుతున్నాయనేది అర్థం అవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ సమాచారం ప్రకారం 25 శాతం కార్యాలయాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడైంది.

మొత్తంగా ఐటీ కంపెనీల నిర్ణయం ఉద్యోగులకు ఆనందాన్నిస్తుంది. ఉద్యోగాల కోత ఆగిపోవడంతోపాటు ఎక్కడి నుంచైనా పనిచేసుకునే వెసులుబాటు కలుగుతుంది. కరోనా తర్వాత ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ కోరుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితులు ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశం కల్పిస్తున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version