RRR Movie: తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలనాలకు కేంద్రంగా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ కు సైతం నామినేట్ అయింది. బాహుబలితో అంతర్జాతయంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రత్యేక శైలిలో తెరకెక్కించారు. దర్శకత్వ ప్రతిభతో ఆ సినిమా రేంజ్ ను మరింత పెంచారు. అంతర్జాతీయ అవార్డులు దక్కించుకునేలా తీయడంలో రాజమౌళిది ప్రత్యేక స్టైల్. ప్రస్తుతం అంతర్జాతీయ అవార్డులతో సినిమా స్థాయి మరింత పెరిగింది.

తెలుగు సినిమాకు అరుదైన గుర్తింపు లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమా తన రేంజ్ ను చాటుకుంది. ఆస్కార్ అవార్డులకు నామినేషన్ అయినా అవార్డు రాలేదు. కానీ ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్ల ప్రశంసలు అందుకుంది. రాజమౌళి తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించి అందరిని అబ్బురపరిచారు. సినిమాకు ఇతర దేశాల్లో ఎన్నో అవార్డులు వరించింది. ప్రముఖ ఫిలిం బెస్టివెల్స్ లో సినిమాకు గుర్తింపు దక్కడం గమనార్హం. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మిడ్ సీజన్ ఫిలిం అవార్డ్స్ లలో బెస్ట్ పిక్చర్ లలో ఈ సినిమా రన్నరప్ గా నిలిచింది. అమెరికన్ స్టార్ట్యూమ్ అవార్డ్స్ లో ట్రిపుల్ ఆర్ కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు సొంతం చేసుకుంది.
బెస్ట్ యాక్షన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డులకు కూడా నామినేట్ కావడం విశేషం. హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజనల్ స్కోర్ కేటగిరీలో ఈ సినిమా నామినేట్ కావడం సంచలనం కలిగించింది. న్యూయార్క్ ఫిలిం సర్కిల్లో బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళికి అవార్డు రావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన అవార్డు దక్కింది. సినిమాకు పనిచేసిన టెక్నిషియన్లందరికి కూడా గుర్తింపు దక్కడంతో హర్షం వ్యక్తమవుతోంది. తెలుగు సినిమాకు ఇంతటి స్థాయి దక్కడంతో మన ఖ్యాతి ఎక్కడికో వెళ్లిపోతోంది.

యూఎస్ఏకు చెందిన హెచ్ ఏ క్రిటిక్స్ స్పాట్ లైట్ విన్నర్ గా ట్రిపుల్ ఆర్ సినిమా నిలవడం అందరిలో సంతోషాన్ని నింపింది. రాజమౌళి స్టామీనా తెలిసిందే. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మనం గర్వించదగ్గ స్థాయిలో నిలిచిన రాజమౌళి త్రిపుల్ ఆర్ తో తన రేంజ్ ను మరింత పెంచుకున్నారు. హాలీవుడ్ పరిశ్రమ ప్రముఖులను మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమా ఆకర్షించింది. ఆస్కార్ రాకపోయినా అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని బహుమతులు గెలుచుకోవడం గమనార్హం.
విదేశాల్లో వస్తున్న స్పందన చూస్తుంటే ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డులు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మళ్లీ ఆస్కార్ రేసులో కూడా కొనసాగనుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఖ్యాతి మరోమారు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం చూస్తుంటే భవిష్యత్ లో ఇంకా ఎన్ని అవార్డులు తీసుకుంటారో తెలియడం లేదు. మునుముందు ఇంకా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో మరింత ముందుకు వెళ్లాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.