అగ్ర దర్శకుల బాటలో అనిల్ రావిపూడి.. ఏం చేశాడంటే?

టాలీవుడ్లోని స్టార్ దర్శకులంతా కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా క్రేజ్ ఉన్నప్పుడే వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం అగ్ర దర్శకులు కొనసాగుతున్న వారంతా కూడా కేవలం దర్శకత్వాన్నే నమ్ముకోకుండా సినిమా నిర్మాణం.. ఇతర సినిమాలకు స్క్రీన్ ప్లే అందించడంతోపాటు సమర్పకులుగా మారిపోతున్నారు. Also Read: అగ్ర దర్శకుల బాటలో అనిల్ రావిపూడి.. ఏం చేశాడంటే? ఇప్పటికే దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా నిర్మాణంలోకి దిగడంతోపాటు చిన్న, […]

Written By: NARESH, Updated On : November 17, 2020 5:46 pm
Follow us on

టాలీవుడ్లోని స్టార్ దర్శకులంతా కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా క్రేజ్ ఉన్నప్పుడే వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం అగ్ర దర్శకులు కొనసాగుతున్న వారంతా కూడా కేవలం దర్శకత్వాన్నే నమ్ముకోకుండా సినిమా నిర్మాణం.. ఇతర సినిమాలకు స్క్రీన్ ప్లే అందించడంతోపాటు సమర్పకులుగా మారిపోతున్నారు.

Also Read: అగ్ర దర్శకుల బాటలో అనిల్ రావిపూడి.. ఏం చేశాడంటే?

ఇప్పటికే దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా నిర్మాణంలోకి దిగడంతోపాటు చిన్న, మీడియం సినిమాలకు వీలున్నప్పుడల్లా రచనా సహకారం అందిస్తున్నాడు. రాజమౌళి బాటలోనే దర్శకుడు సుకుమార్.. పూరి జగన్మాథ్.. త్రివిక్రమ్ లాంటి వాళ్లు కూడా సినిమా నిర్మాణంతోపాటు ఇతర సినిమాలను స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు. వీరిలో బ్యాచులోకి మరో స్టార్ డైరెక్టర్ తాజాగా వచ్చి చేరాడు.

ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’తో దర్శకుడు అనిల్ రావిపూడి ఇండస్ట్రీ హిట్టందుకున్నాడు. ఈ సినిమాతో అనిల్ సైతం స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. దీంతో ఆయన వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు చిన్న సినిమాలకు స్క్రీన్ ప్లే అందిస్తూ సమర్పకుడిగా మారబోతుండటం ఆసక్తిని రేపుతోంది.

Also Read:  మెగా హీరో సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్.. శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గాలి సంపత్’ మూవీకి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. కమర్షియల్ చిత్రాలతో బీజీగా ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా రచనా సహకారం అందించడంతో ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ మూవీకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా సాయి అనే రచయిత సహకారం అందిస్తున్నాడు. సాహు గారపాటి.. హరీష్ పెద్దిలతో కలిసి ఎస్.కృష్ణ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్