https://oktelugu.com/

Anil Ravipudi Tamanna’s clash ఎఫ్3 టీంతో తమన్నాకు గొడవ.. బయటపెట్టిన అనిల్ రావిపూడి!

Anil Ravipudi Tamanna’s clash  టాలీవుడ్ లో ‘ఎఫ్3’తో సంచలన విజయాన్ని అందించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమా ప్రమోషన్ ను వినూత్నస్థాయిలో చేసి ప్రేక్షకులకు చేరువ చేశారు. సినిమా రిలీజ్ కు ముందు నుంచి.. రిలీజ్ అయిన తర్వాత కూడా అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్ లు ప్రమోషన్స్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు. తాజాగా కామెడీ బ్రహ్మ బ్రహ్మానందంతో కూడా ఈ ప్రమోషన్ నిర్వహించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 4, 2022 / 09:51 PM IST
    Follow us on

    Anil Ravipudi Tamanna’s clash  టాలీవుడ్ లో ‘ఎఫ్3’తో సంచలన విజయాన్ని అందించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమా ప్రమోషన్ ను వినూత్నస్థాయిలో చేసి ప్రేక్షకులకు చేరువ చేశారు. సినిమా రిలీజ్ కు ముందు నుంచి.. రిలీజ్ అయిన తర్వాత కూడా అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్ లు ప్రమోషన్స్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు. తాజాగా కామెడీ బ్రహ్మ బ్రహ్మానందంతో కూడా ఈ ప్రమోషన్ నిర్వహించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయం సాధించారు.

    అయితే ఎఫ్3 టీంలోని అందరూ ప్రమోషన్ లో పాల్గొంటున్నా సినిమాలో మెయిన్ హీరోయిన్ తమన్నా మాత్రం ఇంతవరకూ కనిపించలేదు. సినిమా రిలీజ్ కు ముందు.. తర్వాత కూడా అగుపించలేదు. కనీసం ప్రీరిలీజ్ వేడుకలో కూడా పాల్గొనలేదు.హాట్ బ్యూటీకి ‘ఎఫ్3’ టీంతో గొడవైందని.. అందుకే ప్రమోషన్లలో పాల్గొనలేదని వార్తలు వచ్చాయి.

    ఇక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలోనూ ఇదే విషయంపై ఆయన ప్రశ్నించారు. తమన్నాతో గొడవ ఎలా జరిగింది? ఎందుకు ఆమె ప్రమోషన్లలో పాల్గొనడం లేదని అడిగారు. దీనికి అనిల్ రావిపూడి కొంచెం సీరియస్ గానే బదులిచ్చాడు.

    నిజానికి ఎఫ్3 రిలీజ్ సమయంలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లింది. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రమోషన్స్ లోనూ పాల్గొనలేదు. దీంతో తమన్నాకు, ఈ సినీ బృందానికి మధ్య గొడవలు జరిగాయని ప్రచారం సాగింది. దీనిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని.. మీడియా వాళ్లు అలా సృష్టిస్తారు అని క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఎఫ్3 రిలీజ్ కుముందు తమన్నా కేన్స్ ఫెస్టివెల్ కు వెళ్లిందని.. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో బిజీగా ఉండడం వల్లే రాలేదని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. దీంతో తమన్నాకు, ఎఫ్3 టీంకు మధ్య గొడవలు లేవని తేలిపోయింది.