https://oktelugu.com/

Balakrishna- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ ని ‘ఛీ’ కొట్టిన బాలయ్య.. ఇంత ద్వేషం ఎందుకు..?

Balakrishna- Rajendra Prasad: నందమూరి బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో విరామం లేకుండా సాగుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య కి కూతురుగా నటిస్తుంది.ఉగాది కానుకగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో బాలయ్య బాబు గెటప్ చూసి ఫ్యాన్స్ ఎంతో సంతోషపడ్డారు. బాలయ్య వయస్సు కి తగ్గ […]

Written By:
  • Vicky
  • , Updated On : April 24, 2023 / 04:24 PM IST
    Follow us on

    Balakrishna- Rajendra Prasad

    Balakrishna- Rajendra Prasad: నందమూరి బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో విరామం లేకుండా సాగుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య కి కూతురుగా నటిస్తుంది.ఉగాది కానుకగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో బాలయ్య బాబు గెటప్ చూసి ఫ్యాన్స్ ఎంతో సంతోషపడ్డారు.

    బాలయ్య వయస్సు కి తగ్గ పాత్రలు పోషిస్తూ ముందుకు పోతున్నాడని, ఈ చిత్రంతో ఆయన వంద కోట్ల రూపాయిల షేర్ ని కూడా కొల్లగొట్టబోతున్నాడని అభిమానులు బలంగా చెపుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. అదేమిటి అంటే ఈ చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ ని తీసుకుందామని అనిల్ రావిపూడి అడిగితే బాలయ్య ‘నో’ చెప్పాడట.

    Rajendra Prasad

    అనిల్ రావిపూడి తన ప్రతీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ని తీసుకుంటాడు.ఆయనకంటూ ప్రత్యేకమైన మ్యానరిజమ్స్ తో పాత్రలను డిజైన్ చేస్తాడు.ఆయన లేటెస్ట్ చిత్రం F3 లో కూడా రాజేంద్ర ప్రసాద్ కి మంచి పాత్ర ఇచ్చాడు. ఇప్పుడు బాలయ్య తో చేస్తున్న సినిమాలో కూడా ఒక కీలక పాత్ర కోసం రాజేంద్ర ప్రసాద్ ని తీసుకోవాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆలోచిస్తుండగా, బాలయ్య వెంటనే నో చెప్పాడట.

    ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఇండస్ట్రీ లో ప్రతీ హీరో తో మంచి స్నేహభావం తో మెలిగే రాజేంద్ర ప్రసాద్ కి మరియు బాలయ్య కి పడడం లేదా, వీళ్లిద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి.అసలు నిజంగానే వీళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయా,లేకపోతే ఇది ఎవరైనా పుట్టించిన రూమరా? వంటి సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.