Cyber Fraud: సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నేరాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు మోసగాళ్లబారిన పడుతూనే ఉన్నారు. తాజాగా వాట్సాప్‌లో వచ్చిన ఓ లింక్‌ను ఒక్క క్లిక్ చే యగానే ఓ టీచర్ ఖాతా ఖాళీ అయింది.
గుర్తుతెలియని లింక్‌లో ఏముందో చూద్దామని..
అన్నమయ్య మదనపల్లె పట్టణం రెడ్డప్పనాయుడు కాలనీకి చెందిన వరలక్ష్మి ఉపాధ్యాయురాలు. ఆమెకు గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్‌లో ఒక లింక్ వచ్చింది. అందులో ఏముందు చూద్దామని ఆమె లింక్‌ను క్లిక్ చేసింది. వెంటనే ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.21 లక్షలను సైబర్ మోసాగాళ్లు ఊడ్చేశారు. లింక్ క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి అందులో ఉన్న నగదు మొత్తాని ఒకే ట్రాంజాక్షన్‌తో ఖాళీ చేశారు.
బ్యాంకుకు వెళ్తే…
ఒక్కసారిగా తనకు తెలియకుండానే తన ఖాతాలోని రూ.21 లక్షలు ఖాళీ కావడంతో ఆందోళన చెందిన వరలక్ష్మి హుటాహుటిన బ్యాంకు వద్దకు వెళ్లింది. అసలు ఏం జరిగిందని బ్యాంకు సిబ్బందిని తెలుసుకోగా, వారు ఖాతాను తనిఖీ చేశారు. అకౌంట్‌ను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేశారని, నగదు మొత్తం అపహరించారని చెప్పారు. ఇది ఎలా జరిగిందో తెలియక ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఫోన్ నంబర్‌తో నగదు దోపిడీ..
పోలీసులు ఏం జరిగిందని సైబర్ టీం ద్వారా విచారణ జరిపించారు. ఆరోజు ఆమె ఫోన్‌కు వచ్చిన కాల్స్ పరిశీలించారు. అందులో ఏమీ తేలలేదు. తర్వాత టెక్స్›్ట మెసేజ్‌లు పరిశీలించారు. అందులో కూడా ఏమీ లేదని నిర్ధారించారు. తర్వాత వాట్సాప్‌కు వచ్చిన మెస్సేజ్‌లు పరిశీలించారు. అందులో అన్‌నోన్ నంబర్ నుంచి వచ్చిన లింకులు తనిఖీ చేయగా షాక్ అయ్యారు. వరలక్ష్మి ఫోన్ నంబర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్‌చేసి ఒక లింక్ పంపించారని, ఆమె లింక్ క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి నగదు డ్రాచేశారని వెల్లడించారు.
ఒకే నంబర్ కావడంతో..
వరలక్ష్మి ఉపయోగించే ఫోన్ నంబర్ వాట్సాప్, బ్యాంకు లింక్, ఫోన్ పే, గూగుల్‌పే నంబర్ ఒక్కటే కావడం సైబర్ నేరగాళ్లకు కలిసి వచ్చిందని పోలీసులు నిర్ధారించారు. బ్యాంకు ఖాతాతో లింక్ ఉన్న నంబర్లను సోషల్ మీడియా ఖాతాలకు వినియోగించకపోవడమే మంచిందటున్నారు. ఒకవేళ ఉపయోగించాల్సి వచ్చినా తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు, వాట్సాప్‌లో వచ్చే లింక్స్ క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Andhra pradesh woman loses rs 21 lakh after clicking on a link received on whatsapp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com