https://oktelugu.com/

Child Marriages In AP: బాల్య వివాహాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్.. తెలంగాణ స్థానం ఏంటో తెలుసా?

Child Marriages In AP: దేశం ఎంత పురోగమిస్తున్నా కొన్ని ఆచారాలు మాత్రం తగ్గడం లేదు. కంప్యూటర్ కాలంలో కూడా బాల్య వివాహాలు భయపెడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. పుస్తకాలు మోసే వయసులో కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుంది ఆడపిల్లలు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితి గతి తప్పుతోంది. చిన్న వయసులో వివాహాలు చేయడంతో సంసారం చేసేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పరిస్థితులను ఆకళింపు […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 19, 2022 / 12:17 PM IST
    Follow us on

    Child Marriages In AP: దేశం ఎంత పురోగమిస్తున్నా కొన్ని ఆచారాలు మాత్రం తగ్గడం లేదు. కంప్యూటర్ కాలంలో కూడా బాల్య వివాహాలు భయపెడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. పుస్తకాలు మోసే వయసులో కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుంది ఆడపిల్లలు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితి గతి తప్పుతోంది. చిన్న వయసులో వివాహాలు చేయడంతో సంసారం చేసేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పరిస్థితులను ఆకళింపు చేసుకునే మెచ్యూరిటీ రాకపోవడంతో వారు తంటాలు పడాల్సి వస్తోంది.

    Child Marriages In AP

    బాల్య వివాహాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలో నిలవడం ఆందోళనకరం. దక్షిణ భారత దేశంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. ఏపీలో ఎక్కువగా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి సంసార భారాన్ని మోపుతున్నారు. ఫలితంగా వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారేందుకు కారణమవుతున్నారు.

    Also Read: R Krishnaiah- Rajya Sabha: ఆర్.క్రిష్ణయ్యకు రాజ్యసభ సీటంటే జగన్ కాపులకు రెచ్చగొట్టడమేనా?

    15-19 సంవత్సరాల వయసులోనే అమ్మాయిలు తల్లులుగా మారడంతో వారి మానసిక స్థితి గతి తప్పుతోంది. కరోనా సమయంలో బాల్య వివాహాల సంఖ్య మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక మూడో స్థానం, తమిళనాడు నాలుగో స్థానం, కేరళ చివరి స్థానంలో నిలిచింది. చిన్నారులకు పెళ్లిళ్లు చేయడం మంచిది కాదని తెలుస్తున్నా ప్రజల్లో ఇంకా చైతన్యం రాకపోవడం విడ్డూరమే.

    Child Marriages In AP

    అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 37 శాతం, కర్నూలులో 36 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి. దీంతో చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తూ వారి జీవనం సజావుగా సాగకుండా అడ్డుకునే వారవుతున్నారు. ఉత్తరాది కంటే దక్షిణాదిలోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆడపిల్లల ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో బాల్య వివాహాలను చేయొద్దని ఎంతగా చైతన్యం కలిగిస్తున్నా ప్రజల్లో మార్పు రాకపోవడం గమనార్హం.

    Also Read:Bigg Boss Non Stop Voting Results: బిగ్ బాస్ ఓటింగ్: విన్నర్ ఎవరో డిసైడైంది.. ఓటింగ్ లో టాప్ ఎవరంటే?

    Tags