Anchor Suma : యాంకర్ గా సుమ కనకాల సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉంది.ఆమె రికార్డ్స్ ఎవరూ బ్రేక్ చేయాలనివి. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన సుమ రెండు మూడు చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు. దాంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యింది. నటిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆమె నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. సంపాదనలో సుమదే సింహభాగం.
ఆమెకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. లగ్జరీ హౌస్ ఉంది. సుమ ఇంట్లో షూటింగ్స్ కూడా జరుగుతాయని సమాచారం. సుమకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు రోషన్, అమ్మాయి పేరు మనస్విని. రోషన్ ని హీరోగా లాంచ్ చేస్తున్నారు. బబుల్ గమ్ టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో రోషన్ హీరో. రొమాంటిక్ లవ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో సుమ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సుమ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ఆమె ఆర్థిక భద్రత, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచింపజేసే కామెంట్స్ చేసింది. సమాజంలో మహిళలు భర్త మరణిస్తే కుటుంబ పోషణ కోసం రకరకాల పనులు చేస్తుంటారు. వారికి బ్యాంకు బ్యాలన్స్, ఇన్సూరెన్స్, డబ్బులు దాచుకోవడం వంటి విషయాలు తెలియవు. భర్తకు ఇన్సూరెన్స్ ఉంటే భార్యకు ఎంతో కొంత డబ్బులు వస్తుందని కూడా తెలియదు.
అందుకే నా పిల్లలు అన్ని విషయాలు చెప్పాను. నా పేరున ఉన్న ఇన్సూరెన్స్ గురించి వివరించాను. ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. నేను కన్నుమూసినా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశానని సుమ అభిప్రాయ పడ్డారు. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని పిల్లలు అన్నారట. సుమ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఆ మధ్య సుమ-రాజీవ్ విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను సుమ తనదైన శైలిలో ఖండించింది.