
Krishna Bhagavaan- Anchor Soumya Rao: జబర్దస్త్ ఒకప్పటి క్రేజ్ కోల్పోయింది. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. జబర్దస్త్ కి ప్రధాన ఆకర్షణగా ఉన్నవారందరూ బయటకు వెళ్లిపోయారు. నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్, అనసూయ వంటి స్టార్స్ జబర్దస్త్ వీడాక ప్రేక్షకుల్లో ఆసక్తి పోయింది. హైపర్ ఆది వస్తూ పోతూ ఏదో పేరుకు ఉన్నాం అనిపించుకుంటున్నాడు. సినిమాలు, రాజకీయాల్లో బిజీ అయిన హైపర్ ఆదికి జబర్దస్త్ కోసం మనస్ఫూర్తిగా పని చేసే టైం లేదు. కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి లాంటి సీనియర్స్ ఇప్పుడు లేరు. టీం లీడర్స్, కమెడియన్స్ అంతా కొత్త సరుకు.
జబర్దస్త్ టీఆర్పీ బాగా తగ్గిపోయింది. దీంతో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త యాంకర్ ఏకంగా జడ్జి కృష్ణభగవాన్ తో రొమాన్స్ చేసింది. లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ లో సౌమ్యరావు జడ్జి కృష్ణభగవాన్ కి ముద్దులు ఇచ్చింది. నూకరాజు, సౌమ్యరావు మధ్య చిన్న ఛాలెంజ్ ఏర్పడింది. నూకరాజు నేను చేసిన ప్రతి పని నువ్వు చేయాలని సౌమ్యరావుతో అన్నారు. చేస్తానని ఆమె చెప్పింది. నేరుగా వెళ్లి కృష్ణభగవాన్ బుగ్గపై నూకరాజు ముద్దు పెట్టాడు.

నేను కూడా చేస్తాను అంటూ సౌమ్యరావు జడ్జి కృష్ణభగవాన్ బుగ్గ మీద ముద్దు పెట్టబోయింది. అయితే పక్కనే ఉన్న లేడీ జడ్జి ఇంద్రజ అడ్డుకున్నారు. దాంతో బుగ్గమీద ఇవ్వాల్సిన ముద్దు చేతికి ఇచ్చింది. సౌమ్యరావు చర్యకు అందరూ షాక్ అయ్యారు. సౌమ్యరావు ముద్దు పెట్టిన చేతిని ముద్దాడి కృష్ణభగవాన్ తన రొమాంటిక్ టైమింగ్ ని నిరూపించుకున్నారు. అయితే ఇవన్నీ స్క్రిప్టెడ్ మాత్రమే. అప్పుడప్పుడు అనుకుని చేసేవి కావు. జబర్దస్త్ షోకి ఆదరణ తెచ్చి, టీఆర్పీ పెంచడం కోసం వేసే ట్రిక్స్.

ఇటీవల అనసూయ ఇదే విషయమై జబర్దస్త్ మీద ఫైర్ అయ్యారు. పరోక్షంగా ఆమె తన అసహనం బయటపెట్టారు. మీరు మళ్ళీ యాంకర్ గా ఎప్పుడు బుల్లితెరకు వస్తారని ఒక నెటిజెన్స్ ఆన్లైన్ చాట్ లో అడగ్గా… నిర్వాహకులు టీఆర్పీ కోసం వేసే చెత్త స్టంట్స్ ఆపితే కానీ నేను మళ్ళీ యాంకర్ గా అడుగు పెట్టను అన్నారు. అది జరగదు కాబట్టి అనసూయ యాంకర్ కావడం జరగని పని అని చెప్పకనే చెప్పింది. సౌమ్యరావు అనసూయ స్థానంలోనే వచ్చింది. గత ఏడాది అనసూయ జబర్దస్త్ మానేశారు. కొన్నాళ్లు రష్మి గౌతమ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ బాధ్యతలు తీసుకున్నారు. కొత్తగా కన్నడ సీరియల్ నటి సౌమ్యరావు ఎంట్రీ ఇవ్వడం జరిగింది.