
Rashmi – Nagashaurya : బుల్లితెర మీద టాప్ యాంకర్ గా కొనసాగుతున్న రష్మీ, సోషల్ మీడియా ద్వారా ఈ సమాజం లో జరుగుతున్న వాటిపై ఎలాంటి భయం , బెరుకు లేకుండా తనకి అనిపించింది చెప్తూ ఉంటుంది.మంచి ఫైర్ బ్రాండ్ గా ఈమెకి సోషల్ మీడియా లో మంచి పేరుంది.నిన్న ప్రముఖ హీరో నాగ శౌర్య హైదరాబాద్ లోని ఒక ప్రాంతం లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక అబ్బాయి అమ్మాయి మీద చెయ్యి చేసుకోవడాన్ని గమనించి, కారు ఆపి అతని వద్దకి వెళ్లి గొడవలు పెట్టుకొని ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పించిన సంఘటన సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఎక్కడ చూసిన ఇప్పుడు దీని గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.వీడియో బాగా వైరల్ అయ్యింది, దీనిపై నెటిజెన్స్ నుండి భిన్నమైన కామెంట్స్ రావడం మనం గమనించొచ్చు.వాటి పై రష్మీ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యింది.
కొంతమంది నెటిజెన్స్ ఆ వీడియో ని చూసి ‘తన లవర్ ని తానూ కొట్టుకుంటాడు..ఇంకా ఏమైనా చేసుకుంటాడు, మధ్యలో నీకు ఎందుకు అయ్యా..సినిమాల ప్రొమోషన్స్ కోసం చేస్తున్నావని మాకు అర్థం అయ్యిందిలే’ అంటూ కొంతమంది నెటిజెన్స్ చాలా చీప్ గా కామెంట్స్ చేయడాన్ని గమనించిన రష్మీ, వెంటనే వాళ్ళ కామెంట్స్ ని స్క్రీన్ షాట్స్ తీసి ట్వీట్ చేస్తూ ‘వాడి లవర్ వాడి ఇష్టం అంట..ఆ అమ్మాయే వాడికి సపోర్ట్ చేస్తుంది అట..అసలు ఆ అమ్మాయి ఎలాంటి ఒత్తిడిలో ఉందో ఎవరికీ తెలుసు, మరో ఆత్మహత్య జరిగే వరకు మీరు ఇలాగే చూస్తూ నోటికి వచ్చిన కామెంట్స్ చేస్తారా..అసలు మీకు సిగ్గు అనేది ఉందా’ అంటూ ట్వీట్ చేసింది.రష్మీ వేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.చాలా కరెక్ట్ గా చెప్పావు అంటూ ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.