Anchor Pradeep: తాటి చెట్టు క్రింద మజ్జిక తాగినా కల్లే అంటారు. వయసులో ఉన్న కుర్రాడు ఏ అమ్మాయితో మాట్లాడినా ఉన్న పెళ్లే అంటారు. యాంకర్ ప్రదీప్ పరిస్థితి అలానే ఉంది. 37ఏళ్ల ప్రదీప్ మాచిరాజు పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఏడాదిలో రెండు మూడు సార్లు ఆయన పెళ్లి పుకార్లు తెరపైకి వస్తాయి. ఇందులో నిజం ఏంటో అబద్దం ఏమిటో తెలియని పరిస్థితి. ప్రదీప్ కి పెళ్లీడు వచ్చి చానాళ్ళు అవుతుండగా… అదుగో పెళ్లి ఇదుగో పెళ్లి అంటూ వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

ఈ బుల్లితెర సుందరాంగుడు మామూలోడు కాదు. మన అందగాడి కోసం ఏకంగా ఒక స్వయంవరమే జరిగింది. పెళ్లి చూపులు పేరుతో ఒక షో నిర్వహించారు. సుమ యాంకర్ గా వ్యవహరించిన ఈ షోలో పలు రంగాలకు, నేపధ్యాలకు చెందిన పెళ్లికాని యువతులు పాల్గొన్నారు. వారికి వివిధ దశల్లో పరీక్షలు పెట్టి ప్రదీప్ కోసం అమ్మాయిని ఎంపిక చేసే ప్రోగ్రాం పెట్టారు. ఈ పెళ్లి చూపులు షోకి ప్రదీప్ నిర్మాతగా వ్యవహరించారని సమాచారం. నిజంగా ప్రదీప్ ని వివాహం చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అమ్మాయిలు పెళ్లి చూపులు షోలో పాల్గొన్నారు.
షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. భారీగా ఖర్చు చేసినా టీఆర్పీ రాలేదు. ప్రదీప్ ని పెళ్లాడాలని వచ్చిన యువతులతో షో అనంతరం కూడా ప్రదీప్ పరిచయాలు కొనసాగించాడని సమాచారం. వారిలో ఒక అమ్మాయి బాగా ఫేమస్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతు ని ప్రదీప్ వివాహం చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ప్రత్యేకించి అమ్మాయి పేరు, వివరాలు కూడా బయటపెడుతూ వార్తలు రావడంతో నిజమే అనుకున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తుండగా.. మరోసారి ప్రదీప్ నిరాశపరిచాడు.

అసలు నవ్య మారోతుతో నేను మాట్లాడిందే లేదు. ప్రొఫెషన్ లో భాగంగా మా టీమ్ ఇంటరాక్ట్ అయ్యారు. అంతకు మించి ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. షూటింగ్ లో బిజీగా ఉండటం వలన స్పందించడం లేటయ్యిందని కొట్టిపారేశారు. కెరీర్ మీదే నా ఫోకస్ అన్నాడు. ఈసారి ప్రదీప్ పెళ్లి ఖాయమని నమ్మిన జనాలు పెద్ద షాక్ తిన్నారు. నలభై ఏళ్ళు దగ్గరపడుతుంటే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు సామీ అని పెదవి విరుస్తున్నారు. వయసంతా పోయాక, పెళ్లి చేసుకొని ప్రయోజనమేంటని సెటైర్లు వేస్తున్నారు.