https://oktelugu.com/

Anasuya Without Makeup: యాంకర్ అనసూయ పిక్స్ వైరల్.. మేకప్ లేకుండా చూసి షాక్‌లో అభిమానులు!

Anasuya Without Makeup: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ఓ వైపు యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో బిజీబిజీగా గడుపుతోంది ఈ స్టన్నింగ్ బ్యూటీ. అనసూయకు సోషల్ మీడియాలో హీరోయిన్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన గ్లామర్‌తో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అను.. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా ట్రై చేసిన అనసూయ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఫ్యామిలీ కోసం ప్రైవేట్ జాబ్స్ చేసింది. కొంతకాలం […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 4, 2022 / 03:32 PM IST
    Follow us on

    Anasuya Without Makeup: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ఓ వైపు యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో బిజీబిజీగా గడుపుతోంది ఈ స్టన్నింగ్ బ్యూటీ. అనసూయకు సోషల్ మీడియాలో హీరోయిన్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన గ్లామర్‌తో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అను.. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా ట్రై చేసిన అనసూయ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఫ్యామిలీ కోసం ప్రైవేట్ జాబ్స్ చేసింది. కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

    Anasuya Without Makeup

    ఆర్య-2 సినిమాలో శ్రద్దా దాస్ క్యారెక్టర్‌లో ముందుగా దర్శకుడు సుకుమార్ అనసూయను తీసుకుందామని అనుకున్నారట.. ఇదే విషయం అనసూయకు చెప్పగా.. ఫ్యామిలీ కోసం అప్పట్లో ఈ ఆఫర్‌ను వద్దనుకున్నదని తెలిసింది. ఆ తర్వాత తన భర్త ప్రోత్సాహంతో మల్లెమాల ప్రొడక్షన్‌లో వచ్చిన బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ప్రొగ్రామ్ యాంకర్‌గా ఎంపికైంది ఈ ముద్దుగుమ్మ.. జబర్దస్త్ షోలో అనసూయ డ్రెస్సింగ్ స్ట్రైల్, పొట్టి బట్టల్లో తన అందాల చందాలను వడ్డించడంతో అనసూయ పేరు ఒక్కసారిగా మారుమోగింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న లేటెస్ట్ ఫోటో షూట్‌లో అను కుర్ర హీరోయిన్లకు దీటుగా పోటీనిచ్చింది.

    Also Read: మీ బోడి పెద్దరికం ఎవరడిగారు? చిరంజీవిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి

    దర్శకుడు సుకుమార్ చూపులు అనసూయ అందచందాలపై పడటంతో ఆయన సినిమాల్లో వరుసగా ఆఫర్లు ఇస్తూ వస్తున్నారు. గతంలో రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్ ను షోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    తాజాగా అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమాల్లో దాక్షాయణి క్యారెక్టర్ చేసింది ఈ హాట్ బ్యూటీ.. అనసూయకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా రోజురోజుకూ తన గ్లామర్ పెరుగుతోంది. మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు. తాజాగా మేకప్ లేకుండా అనసూయ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. మేకప్ లేకుండా కూడా అను చాలా అందంగా ఉందని ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.

    Also Read: వర్కౌట్ కాదన్నా నితిన్ ఆశ చంపుకోవట్లేదు !

    Tags