
Anasuya Bharadwaj: అనసూయ అందాలను ఈ పరిశ్రమ కొంచెం లేటుగా గుర్తించింది. లేదంటే టాప్ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ని ఏలేసేది. ఒడ్డు పొడుగు కలిగిన అనసూయ బాలీవుడ్ రేంజ్ మెటీరియల్. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే మనసులు గతి తప్పడం ఖాయం. చీరలో వయ్యారాలు పోతూ కవ్వించింది. బటన్స్ లేని జాకెట్ ధరించి వంగి వంగి పరువాలు వడ్డించింది. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
అనసూయ లేటెస్ట్ మూవీ రంగమార్తాండ ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ డిజైనర్ శారీ ధరించి మీడియా ముందుకు వచ్చారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్స్ ప్రదర్శన ముగిసిన నేపథ్యంలో మూవీ చూసిన ప్రేక్షకులు సినిమా బాగుందంటున్నారు.

రంగమార్తాండ మూవీలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ప్రధాన పాత్రలు చేశారు. ఇక అనసూయ ప్రకాష్ రాజ్ కోడలు పాత్ర చేయడం విశేషం. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కించుకున్న అనసూయ న్యాయం చేశారంటూ క్రిటిక్స్ కొనియాడుతున్నారు. చూస్తుంటే అనసూయ ఖాతాలో రంగమార్తాండ రూపంలో హిట్ పడినట్లు అనిపిస్తోంది. శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, అలీ రేజా ఇతర కీలక రోల్స్ చేశారు.
అనసూయ ఖాతాలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాలో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ వన్ లో దాక్షాయణిగా డీ గ్లామర్ లుక్ లో ఆమె అలరించారు. పార్ట్ 2లో అనసూయ పాత్రకు సుకుమార్ ఎలాంటి ముగింపు ఇచ్చారో చూడాలి. పుష్ప 2 మూవీ మీద ఇండియా వైడ్ అంచనాలున్నాయి.

కాగా అనసూయ యాంకరింగ్ పూర్తిగా మానేశారు. ఇకపై అటువైపు వచ్చేది లేదని తేల్చి చెప్పారు. బుల్లితెర షోలలో టీఆర్పీ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. అనసూయ జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ రాబట్టిన సంగతి తెలిసిందే. అక్కడ మొదలైన ఆమె ప్రస్థానం హీరోయిన్ గా చేసే స్థాయికి చేరింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు స్టార్స్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ దక్కించుకుంటున్నారు.