Anasuya Bharadwaj : స్టార్ యాంకర్ అనసూయ యజ్ఞ యాగాదులు చేస్తున్నారు. భర్తతో కలిసి క్రతువులు నిర్వహిస్తున్నారు. అనసూయ పూజలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కారణమేంటని జనాలు సందేహ పడుతున్నారు. అనసూయ సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి విషయం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తినే తిండి, కట్టే బట్ట, తిరిగే ప్రదేశం… ఒకటేంటి ప్రతి అప్డేట్ ఇస్తుంది. దానికి అనసూయ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ ఎప్పటిలాగే ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా అనసూయ భర్త భరద్వాజ్ తో పాటు పూజలు చేస్తున్న వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అనసూయ కుటుంబం మొత్తం సాంప్రదాయ బట్టల్లో కనిపించారు. ముఖాలపై హరి నామాలు పెట్టారు. పండితులతో ఏదో యాగం చేస్తున్నట్లు ఆ సెటప్ ఉంది. దీంతో అనసూయ ఏదో పెద్ద కార్యక్రమమే చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమైంది. ప్రతి ఫోటో, వీడియోకు అనసూయ కామెంట్ రూపంలో వివరణ ఇస్తారు. ఈ వీడియోకి జస్ట్.. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అని మాత్రమే కామెంట్ చేశారు. పూజకు సంబంధించిన వివరాలు తెలియపరచలేదు. ఆ పరిసరాలు చూస్తుంటే అనసూయ ఈ పూజ తన సొంత ఊరిలో చేశారేమో అనిపిస్తుంది.
ఇక యాంకరింగ్ మానేశాక అనసూయ హాట్ ఫోటో షూట్స్ మోతాదు కూడా తగ్గింది. ఆ యాంగిల్ లో అనసూయ అభిమానులు నిరాశ చెందుతున్నారు. జబర్దస్త్ తో పాటు ఒకటి రెండు షోస్ కి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ సదరు షోస్ లో ధరించిన బట్టల్లో ఫోటో షూట్స్ చేసేవారు. వారానికి కనీసం మూడు నుండి నాలుగు గ్లామరస్ ఫోటో షూట్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేవారు. నటిగా బిజీ అయిన అనసూయ యాంకరింగ్ వదిలేశారు. అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు.

బెటర్మెంట్ కోరుకున్న అనసూయ నటనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఆమె ఒక్క కాల్షీట్ కు రూ. 2 నుండి 3 లక్షలు తీసుకుంటున్నారట. స్టార్స్ చిత్రాల్లో కీలక రోల్స్ దక్కించుకుంటున్న ఆమె లీడ్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఓటీటీ ఒరిజినల్స్, వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. అధికారికంగా అనసూయ పుష్ప 2లో నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ సీక్వెల్ మరింత భారీగా ప్లాన్ చేశారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో ఓ రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో అనసూయ దేవదాసిగా కనిపిస్తారననే ప్రచారం జరుగుతుంది.