Anasuya Viral Pics: అనసూయ గ్లామర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అమ్మడు తన అందాలతో అభిమానులకు కునుకు లేకుండా చేస్తుంది. వెకేషన్ లో ఉన్న అనసూయ గ్లామరస్ గెటప్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయ నటిగా ఫుల్ బిజీ. దాదాపు దశాబ్దం పాటు యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. తనకు ఫేమ్ నేమ్ తెచ్చిన జబర్దస్త్ షోకి 2022లో అనసూయ గుడ్ బై చెప్పింది. మొదట్లో సమయం కుదరకనే జబర్దస్త్ వదిలేసినట్లు చెప్పిన అనసూయ… అనంతరం పరోక్ష ఆరోపణలు చేసింది.
అనసూయ గత ఏడాది అరడజను చిత్రాల్లో నటించింది. రంగమార్తాండ, విమానం వంటి సినిమాల్లో చేసిన పాత్రలకు ప్రశంసలు దక్కాయి. ఆమెకు దర్శక నిర్మాతలు వైవిధ్యమైన పాత్రలు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆమె పుష్ప 2లో కీలక రోల్ లో కనిపించనుంది. విలన్ రోల్ చేసిన సునీల్ భార్యగా ఆమె నటించిన విషయం తెలిసిందే. దాక్షాయణిగా డీగ్లామర్ రోల్ లో అనసూయ పార్ట్ 1లో ఆకట్టుకుంది. ఆగస్టు 15న విడుదల కానున్న పుష్ప 2లో అనసూయకు ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుందో చూడాలి.
మరోవైపు ప్రమోషన్స్ ద్వారా అనసూయ లక్షలు సంపాదిస్తుంది. అనసూయకు భారీ ఫేమ్ ఉండటంతో పాటు ఆమెది లక్కీ హ్యాండ్ అని వ్యాపారస్తులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ లక్షలు ఆర్జిస్తోంది. ఎక్కడికెళ్లినా అనసూయను చూసేందుకు కుర్రాళ్ళు ఎగబడుతున్నారు.
అనసూయ ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తుంది. విరామం దొరికితే కుటుంబంతో పాటు వెకేషన్ కి చెక్కేస్తోంది. ప్రస్తుతం అనసూయ సాగర తీరంలో విహరిస్తోంది. తనకు సముద్రం అంటే ఇష్టం అంటున్న అనసూయ… సాగరాన్ని ఆస్వాదిస్తోంది. ఇక హాట్ ధరించి కౌ గర్ల్ గెటప్ లో సరికొత్తగా దర్శనం ఇచ్చింది. అనసూయ సదరు వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.
View this post on Instagram