Anasuya Bharadwaj: ఈ మధ్య వివాదాలతోనే అనసూయ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె సోషల్ మీడియా ట్రోలర్స్ పై పోరాటం చేస్తున్నారు. తనను ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తే వదిలేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల అనసూయ ఫిర్యాదుతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వీర్రాజు కొన్నాళ్లుగా అనసూయ, శ్రీముఖి,రష్మీ, విష్ణుప్రియ, నటి ప్రగతిలపై అసభ్యకర పోస్ట్స్ పెడుతున్నాడు. ట్రోల్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. వీర్రాజు సోషల్ మీడియా అకౌంట్స్, పోస్ట్స్ ఆధారాలుగా చూపుతూ సైబర్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదు మేరకు వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మీడియా కవరేజ్ వీడియో అనసూయ షేర్ చేశారు. అలాగే పవిత్ర లోకేష్ సైతం సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర పోస్ట్స్, నిరాధార కథనాలు ప్రసారం చేస్తున్నారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద ఆమె కంప్లైంట్ చేశారు. నరేష్ తో పాటు తన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
పవిత్ర లోకేష్ పిర్యాదు ఆధారంగా అరెస్టులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ రెండు సంఘటనల గురించి ఇద్దరు నెటిజెన్స్ మధ్య చర్చ జరిగింది. ట్విట్టర్ ట్రోల్స్ కేసు కూడా సెన్సిటివ్ నా, శిక్షలు పడతాయా అన్న కోణంలో ఒక నెటిజెన్ మరొక నెటిజన్ ని అడిగాడు. అవును పవిత్ర లోకేష్ కంప్లైంట్ చేసినందుకు యూట్యూబ్ ఛానల్స్ మీద చర్యలు తీసుకున్నారట, అని నెటిజెన్ సమాధానం చెప్పాడు. అనసూయను ట్రోల్ చేసినా ఇలాగే చర్యలు ఉంటాయా? అని మొదటి నెటిజన్ అడగ్గా… నరేష్ కి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అనసూయకు అంత సీన్ లేదులే, అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ సోషల్ మీడియా చర్చను అనసూయ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. నరేష్ అంటే మహేష్ ఫ్యామిలీ మెంబర్ పెద్దోళ్ల సప్పోర్ట్ ఉంటుంది. అందుకే వాళ్ళను ట్రోల్ చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని అనసూయ వల్ల ఏమీ కాదులే అన్న అర్థంలో నెటిజన్ చెప్పిన విషయాలను ఆమె పంచుకున్నారు. వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకున్నారు. ఒక పక్క అరెస్టులు జరుగుతుంటే మీరు ఇంకెక్కడ ఉన్నార్రా బాబు, అన్న భావన అనసూయ వ్యక్తీకరించారు. ఈ డ్రామాకు సంబంధించిన అనసూయ ట్వీట్ వైరల్ అవుతుంది.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) November 27, 2022